ఈ సోషల్ మీడియా తో వచ్చిన చిక్కే అది. ఒక నాణేనికి బొమ్మా బొరుసు ఉన్నట్టే ఈ సోషల్ మీడియా కు కూడా రెండు పార్శ్వాలు ఉన్నాయి. సినిమా ప్రమోషన్లు రూపాయ ఖర్చు పెట్టకుండా - ఈజీగా చేసుకోవడం ఫిలిం మేకర్స్ కు ఒక బెనిఫిట్ అయితే.. ట్రోలింగ్ అనేది నెగెటివ్ యాస్పెక్ట్. సెలబ్రిటీలు ఎవరూ ఈ ట్రోలింగ్ బారినుండి తప్పించుకోలేరు. ఆఖరుకు యూత్ సెన్సేషన్ దేవరకొండన్నను కూడా ఈమధ్య ఒకసారి గట్టిగా తగులుకున్నారు.. వాట్ ద ఎఫ్ అని.
ఇక తాజాగా మన టాలీవుడ్ డైరెక్టర్ మారుతి కి ఈ ట్రోలింగ్ హీట్ గట్టిగా తగిలింది. విషయం ఏంటంటే.. 'శైలజారెడ్డి రెడ్డి అల్లుడు' సినిమా నుండి సెకండ్ సింగిల్ ను నిన్న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ టైమ్ చెప్పలేదు. దాంతో అక్కినేని అభిమానులు ఆశగా ఎదురు చూసి చూసి వాళ్ళ కళ్ళకి కాయలు కాచాయి. సాయంత్రం 5 గంటలకు మాజీ ప్రధాని AB వాజ్ పేయి కన్నుమూత కారణంగా సింగిల్ విడుదలను పోస్ట్ పోన్ చేస్తున్నట్టు మారుతి ట్వీట్ చేశాడు. వాయిదా కు వాళ్ళు చెప్పిన రీజన్ ను తప్పు పట్టలేం గానీ అప్పటికే అప్సెట్ అయిన అక్కినేని అభిమానులు మారుతి ని చాలా సభ్యత-సంస్కారాలతో తిట్టడం మొదలు పెట్టారు.
పైగా ఆడియో రిలీజ్ కూడా వాయిదా వేసినట్టు గావార్తలు రావడంతో వాళ్ళ కోపం పెరిగింది. ట్రోలింగ్ మొదలుపెట్టారు. దీంతో వాళ్ళ వేడిని తాళలేక ఇలా ఒక ట్వీట్ పెట్టాడు. "నేను కేవలం దర్శకుడ్ని మాత్రమే. ఓ మంచి సినిమా మాత్రమే తీయగలను. ప్రమోషనల్ ఈవెంట్స్ ను ప్లాన్ చేయలేను. ఇంత వరదల్లో కూడా కేరళలో నేను, నా మ్యూజిక్ డైరక్టర్ రీ-రికార్డింగ్ పూర్తిచేసే పనిలో బిజీగా ఉన్నాం. ఇక్కడ చాలా కష్టాలు పడుతున్నాం." దీంతో కాల్ ఫార్వార్డ్ లాగా అభిమానుల కోపం సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పైకి షిఫ్ట్ అయింది. ఇదిలా ఉంటే.. ఇంత హంగామాకు కారణం అయిన ఆ సెకండ్ సింగిల్ ఈరోజు విడుదల అవుతుందట..గెట్ రెడీ ఫర్ ద ఫన్!