అమీర్ ఖాన్ నటించిన ''లాల్ సింగ్ చద్దా'' సినిమాతో టాలీవుడ్ యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ మూవీ 'ఫారెస్ట్ గంప్' కు అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కిన ఈ ఎమోషనల్ కామెడీ డ్రామాలో చైతూ ఓ కీలక పాత్ర పోషించారు. దీనిపై అభిమానుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో ఆదివారం విడుదలైన 'లాల్ సింగ్ చద్దా' ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందన లభించింది. ఇప్పటికే 24 మిలియన్లకు పైగా వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతోంది. అయితే ఈ ట్రైలర్ విషయంలో అక్కినేని ఫ్యాన్స్ కొందరు హ్యాపీగా ఫీల్ అవుతుంటే.. మరికొందరు మాత్రం నిరుత్సాహానికి గురైనట్లు తెలుస్తోంది.
'లాల్ సింగ్ చద్దా' ట్రైలర్ లో నాగచైతన్య కు ఎక్కువ సీన్లు ఉంటాయని అభిమానులు భావించారు. కానీ ఈ వీడియోలో చైతూని మూడు షాట్స్ కే పరిమితం చేశారు. ఆర్మీ క్యాంప్ లో లాల్ సింగ్ స్నేహితుడిగా చై కనిపిస్తారు. మాతృకలో ఈ పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడ ట్రైలర్ లో మాత్రం చైతూ కి ఆశించినంత స్క్రీన్ స్పేస్ ఇవ్వలేదు. దీంతో ఆ పాత్ర నిడివి కుదించారేమో అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
కాకపోతే తక్కువ షాట్స్ అయినా.. అమీర్ ఖాన్ తో చైతూ అద్భుతమైన స్క్రీన్ స్పేస్ పంచుకున్నారు. లుక్ పరంగా చాలా కొత్తగా కనిపించారు. అమీర్ వంటి వర్సటైల్ యాక్టర్ తో కలిసి నటించడం నాగ చైతన్యకు గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందులోనూ ఆయనది నటనకు ఆస్కారం ఉన్న పాత్ర. నిడివి ఎంతున్నా కచ్చితంగా చై కి కచ్చితంగా సరైన బాలీవుడ్ డెబ్యూ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
గతంలో అక్కినేని నాగార్జున సైతం టాలీవుడ్ లో హీరోగా రాణిస్తూనే అవకాశం వచ్చినప్పుడల్లా బాలీవుడ్ స్క్రీన్ మీద మెరిసారు. 'శివ' 'ఖుదాగవా' 'ద్రోహి' 'క్రిమినల్' 'జక్మ్' 'అగ్ని వర్ష' 'LOC కార్గిల్' వంటి హిందీ చిత్రాల్లో నాగ్ నటించారు. అయితే 2003 తర్వాత హిందీ సినిమాలకు దూరంగా ఉన్న కింగ్.. ఇప్పుడు 'బ్రహ్మాస్త్ర' సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు.
ఇప్పుడు నాగచైతన్య కూడా తండ్రి బాటలో హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టబోతున్నారు. తెలుగులో ఇటీవల వరుస విజయాలతో మార్కెట్ పెంచుకున్న చైతూ.. 'లాల్ సింగ్ చద్దా' చిత్రంతో సాలిడ్ ఎంట్రీ ఇస్తారని నమ్ముతున్నారు. అంతేకాదు చైతూ కి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేయనున్నారు.
ఇప్పుడు హీరోలందరూ పాన్ ఇండియా జపం చేస్తున్న నేపథ్యంలో.. లాల్ సింగ్ చద్దా సినిమా సక్సెస్ అయితే అక్కినేని హీరో పాన్ ఇండియా ఎంట్రీకి మార్గం సుగమం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక 'దూత' వెబ్ సిరీస్ తో నాగచైతన్య జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించనున్నారు. మరి లాల్ సింగ్ చద్దా అక్కినేని హీరోకి ఎలాంటి గుర్తింపు తెచ్చిపెడుతుందో చూడాలి.
కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన 'లాల్ సింగ్ చద్దా' సినిమా 2022 ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ - వయ్ కామ్18 స్టూడీయోస్ బ్యానర్ లపై ఆమిర్ ఖాన్ - కిరణ్‌రావు - జ్యోతి దేశ్ పాండే - అజిత్ అందారే సంయుక్తంగా నిర్మించారు.
2018లో 'థగ్స్ అఫ్ హిందుస్థాన్' తర్వాత అమీర్ నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అమీర్ నటించిన 'దంగల్' సినిమా 2000 కోట్లకు పైగా రాబట్టి.. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది. మరి ఇప్పుడు 'లాల్ సింగ్ చద్దా' తో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.