మన్మథుడు 2 దర్శకుడు రాహుల్ రవీంద్రన్ నాగార్జునకు విపరీతంగా కనెక్ట్ అయ్యాడా అంటే ఔననే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. ఇవాళ విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో నాగ్ ఫుల్ హ్యాపీగా ఉన్నట్టు టాక్. పైగా శాటిలైట్ డిజిటల్ డీల్స్ చాలా క్రేజీ రేట్లకు సేల్ కావడంతో అక్కినేని కాంపౌండ్ కూడా ,మాంచి జోష్ లో ఉంది. దీని సంగతి అలా ఉంచితే తన ఇద్దరు వారసులను ఒకే సినిమాలో పెట్టి మల్టీ స్టారర్ తీయాలనే ఆలోచనలో ఎప్పటి నుంచో ఉన్న నాగ్ దానికి కెప్టెన్ గా రాహుల్ నే మంచి ఛాయస్ గా భావిస్తున్నట్టు ఫ్రెష్ అప్ డేట్.
ఇంకా మన్మథుడు 2 రిజల్ట్ రానే లేదు. కానీ ఇంత నమ్మకంతో పెద్ద ప్రాజెక్ట్ కేవలం రెండు సినిమాల అనుభవం ఉన్న రాహుల్ కి ఇస్తారా అంటే ఇప్పుడే ఏమి చెప్పలేం. పైగా అఖిల్ చైతు ఇద్దరూ కమిట్ మెంట్స్ తో చాలా బిజీగా ఉన్నారు. ముఖ్యంగా నాగ చైతన్య దొరికేది కష్టంగా ఉంది. ఏకంగా నాలుగు ప్రాజెక్టులు లైన్ లో పెట్టేసి రెండేళ్ల దాకా డైరీని బిజీగా ఉంచేసుకున్నాడు.
మరోవైపు బొమ్మరిల్లు భాస్కర్ కోసం ఇటీవలే సెట్స్ లోకి ఎంటరైన అఖిల్ ఇంకో ఎనిమిది పది నెలలు లాక్ అయిపోయాడు. ఒకవేళ రాహుల్ స్క్రిప్ట్ సిద్ధం చేయడానికి ఎలాగూ అంత టైం పడుతుంది కాబట్టి నిజంగా అన్ని కుదిరితే ఇతని మీద పెద్ద బరువే అవుతుంది. కాకపోతే ఇదంతా నిజంగా నాగ్ మనసులో ఉందా లేక జస్ట్ ఫిలిం నగర్ టాకా వేచి చూడాలి.