తెలంగాణ తాజా మాజీ మంత్రి కేటీఆర్ కు టాలీవుడ్ లోని పలువురు ప్రముఖులతో సత్సంబంధాలున్న సంగతి తెలిసిందే. తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని పలువురు హీరో హీరోయిన్లు - దర్శక నిర్మాతలు - ఆర్టిస్టులు....కేటీఆర్ తో సన్నిహితంగా ఉంటారు. గతంలో భరత్ అనే నేను చిత్ర సక్సెస్ లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్ - ప్రిన్స్ మహేష్ బాబులు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారో తెలిసిందే. అదే తరహాలో టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగార్జునతో కూడా కేటీఆర్ కు మంచి దోస్తీ ఉంది. ఈ నేపథ్యంలోనే `దేవదాస్ ` ప్రమోషన్ లో మీడియాతో ముచ్చటించిన నాగ్ కు ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. కేటీఆర్ తో ఉన్న సాన్నిహిత్యం వల్ల త్వరలో నాగ్ రాజకీయాల్లోకి వస్తారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు నాగ్ చాలా సటిల్ గా జవాబిచ్చాడు.
కేటీఆర్ తన మిత్రుడని - ఆయనతో ఫ్రెండ్ షిప్ అలాగే ఉంటుందని అన్నాడు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదని నాగ్ చెప్పాడు. తాను రాజకీయాల్లోకి వస్తానని మీడియా అనుకుంటోందని, తాను అనుకోవడం లేదని సెటైర్ వేశాడు. కేటీఆర్ ఫ్రెండ్ గా నే ఉండడం బెటర్ అని అన్నాడు. దేవదాస్ సినిమాలో నానిని చూసి అసూయగా ఉందని, ఏమో ఏమో తనకు చాలా ఇష్టమని,...ఆ పాట నాని, మందన ల మీద చిత్రీకరించారని అన్నాడు. ఆ పాట తనకు వస్తే బాగుండేదని తనకు చాలా జెలసీగా ఉందని చెప్పాడు. వారూ వీరు అనే పాట కూడా తనకు ఇష్టమని, ఆ సినిమాలో తన పక్కన ఓ అందమైన అమ్మాయి ఉందని నాగ్ అన్నాడు. సెప్టెంబరు 27న `దేవదాస్` ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోన్న సంగతి తెలిసిందే.