సినీ ప్రముఖులు ఎవరైనా ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు చాలానే కండీషన్లు పెడుతున్న ధోరణి అంతకంతకూ పెరుగుతోంది. గతంలో మాదిరి కాకుండా.. మీడియా ప్రతినిధులను నేరుగా ప్రశ్నలు వేయటానికి ముందు.. వారు ఏ సందర్భంలో ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నారన్న అంశంతో పాటు.. సదరు మీడియా సంస్థ దాన్ని ఎలా ప్రజెంట్ చేస్తుందో కూడా అడిగి తెలుసుకుంటున్నారు.
ఇక.. ఇంటర్వ్యూల సందర్భంగా ఎలాంటి ప్రశ్నలు అడగాలి.. ఏం అడగకూడదన్న వరకూ వచ్చేసింది. కొందరు హీరోయిన్లు అయితే.. తమ ప్రత్యేక ఇంటర్వ్యూలను ప్రింట్ చేయటానికి ముందు తమకు చూపించాలన్న రూల్ ను తెర మీదకు తెస్తున్నారు. అయితే.. ఇందుకు భిన్నంగా ఇబ్బందికర ప్రశ్న ఎదురైన వెంటనే.. ఈ ప్రశ్నను డిలీట్ చేయండని అనకుండా.. తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పేయటం అక్షరాహాసన్ గొప్పతనంగా చెప్పాలి.
తాజాగా ఆమె ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆమెను పలు ప్రశ్నలు అడిగారు. ఇబ్బంది కలిగించే వ్యక్తిగత అంశాలకూ ఆమె మొహమాట పడకుండా చెప్పగలిగిన రీతిలో సమాధానం చెప్పటం కనిపిస్తుంది. అలాంటి ప్రశ్నల్లో ఒకటి.. మీ ప్రైవేటు పిక్స్ లీక్ కావటం.. మీ ప్రేమ వ్యవహారానికి సంబంధించిన వార్తలతో తరచూ మీడియాలో దర్శనమిస్తుంటారు కదా? మరి.. లీకైన ఫోటోల సంగతి ఏమిటి? అని ప్రశ్నించినప్పుడు ఆమె నుంచి వచ్చిన సమాధానం ఆసక్తరమని చెప్పాలి.
తననుఇబ్బంది పెట్టే ప్రశ్నకు అక్షరాసన్ బదులిస్తూ.. తాను నమ్మే విషయం ఒకటి ఉంటుందని.. ఫ్యూచర్ అంతా ప్రజంట్ మీద ఉంటుందని.. అలాంటప్పుడు పాస్ట్ (గతం) గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముందంటూ ఫిలాసఫీ చెప్పేసింది.
తనకున్న ఆలోచనా తీరుతో తాను గడిచిపోయిన విషయాల గురించి మాట్లాడనని.. తాను జరుగుతున్న విషయాల గురించి మాత్రమే ఆలోచిస్తానని చెప్పారు. తానేం చెప్పాలో అది చెప్పేసినట్లుగా చెప్పారు. మీ అక్క లవ్ బ్రేకప్ సంగతి గురించి ఆమెను ఎప్పుడైనా అడిగారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. తనకు అడగాలనిపించలేదని.. అందుకే అడగలేదన్నారు. ఆ విషయం గురించి ఆమెతో మాట్లాడలేదన్నారు.