మళ్లీ 'చంద్రముఖి' సందడి

Update: 2019-05-15 01:30 GMT
మలయాళంలో వచ్చిన 'మణి చిత్రతాళు'తో ప్రారంభం అయిన చంద్రముఖి సందడి మూడు దశాబ్దాలు అయినా కొనసాగుతూనే ఉంది. మూడు దశాబ్దాల క్రితం వచ్చిన మణి చిత్రతాళు కు కన్నడంలో 'ఆప్తమిత్ర' రీమేక్‌ వచ్చింది. కన్నడంలో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో తెలుగు, తమిళంలో చంద్రముఖి వచ్చింది. చంద్రముఖి చిత్రంతో రజినీకాంత్‌ మరోసారి తన స్టార్‌ డం చాటుకున్నాడు. తెలుగు మరియు తమిళంలో అప్పట్లో సంచలన వసూళ్లను దక్కించుకున్న చంద్రముఖి కి వెంకటేష్‌ 'నాగవల్లి' అంటూ సీక్వెల్‌ చేశాడు.

వెంకటేష్‌ చేసిన నాగవల్లి చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడింది. రజినీకాంత్‌ పాత్రను వెంకీ పోషించలేక పోయాడని కొందరు, రజినీకాంత్‌ పాత్రలో వెంకీని చూడలేక పోయామని కొందరు విశ్లేషించారు. చంద్రముఖి కి రీమేక్‌ గా హిందీలో తెరకెక్కిన 'భూల్‌ భులయ్యా' చిత్రంకు ఇప్పుడు సీక్వెల్‌ తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగులో వచ్చిన సీక్వెల్‌ 'నాగవల్లి' కథతో భూల్‌ భులయ్యా 2 ను చేస్తారా లేదంటే, కొత్త కథతో హిందీలో సీక్వెల్‌ చేస్తారా అనే విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ 'భూల్‌ భులయ్యా' చిత్రంలో నటించాడు. హిందీలో ఆ చిత్రం యావరేజ్‌ గా నిలిచింది. అయితే అక్షయ్‌ కుమార్‌ చేసిన ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ను ప్రేక్షకులు మర్చిపోలేరు. భూల్‌ భులయ్యా ఒక మోస్తరుగా ఆడినా కూడా ఇప్పుడు దానికి సీక్వెల్‌ చేసేందుకు అక్షయ్‌ కుమార్‌ ఓకే చెప్పడం జరిగింది. ప్రస్తుతం అక్షయ్‌ చేస్తున్న సినిమాలు పూర్తి అయిన తర్వాత భూల్‌ భులయ్యా 2 చిత్రం ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. సౌత్‌ లో చంద్రముఖికి నాగవల్లి అంటూ తీసిన సీక్వెల్‌ నిరాశ పర్చింది. మరి నార్త్‌ లో సీక్వెల్‌ సక్సెస్‌ ను దక్కించుకుంటుందా చూడాలి.
Tags:    

Similar News