సూపర్‌ స్టార్‌ చేరికతో జనవరి ఫైట్ మరింత జఠిలం

Update: 2021-11-17 09:30 GMT
కరోనా కారణంగా దాదాపు 15 నుండి 20 నెలల పాటు పెద్ద సినిమాలేమి కూడా విడుదల అవ్వలేదు. ఎట్టకేలకు దేశంలో పరిస్థితులు చక్కబడుతుండటంతో పాటు రాష్ట్రాలు థియేటర్లపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయడంతో పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్దం అయ్యాయి. ఈ ఏడాదిలోనే ఒకటి రెండు విడుదల అవుతున్నా కూడా పూర్తి భయం వచ్చే ఏడాదికి పోతుందనే ఉద్దేశ్యంతో చాలా సినిమాలు వచ్చే ఏడాది జనవరి నుండి విడుదలకు సిద్దం అవుతున్నాయి.

బిగ్గెస్ట్ స్టార్స్ సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్దకు వచ్చేందుకు సిద్దం అవుతున్న ఈ సమయంలో కొన్ని సినిమాలు క్లాష్ కూడా అవుతున్నాయి. కొద్ది తేడాతో సినిమాలు విడుదల అవ్వబోతున్న నేపథ్యంలో ఫైట్ టఫ్‌ గా మారుతోంది. ఖచ్చితంగా అన్ని సినిమాల వసూళ్లపై ప్రభావం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వచ్చే జనవరిలో మొదటగా టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన భారీ మల్టీ స్టారర్‌ మూవీ ఆర్ ఆర్‌ ఆర్‌ విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. దేశ వ్యాప్తంగా ఆర్ ఆర్‌ ఆర్ ను భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇక ఆర్ ఆర్‌ ఆర్‌ వచ్చిన వారం రోజులకే ప్రభాస్ నటించిన రాధే శ్యామ్‌ సినిమా విడుదల అవ్వబోతుంది. రాధే శ్యామ్‌ విడుదల వాయిదా పడుతుందని అంతా భావించినా కూడా యూవీ క్రియేషన్స్ వారు మాత్రం సంక్రాంతికే వస్తామని చెబుతున్నారు. ఇక భీమ్లా నాయక్‌ కూడా సంక్రాంతికే రాబోతున్న విషయం తెల్సిందే. ఇదే సమయంలో మరో భారీ బాలీవుడ్‌ సినిమాను కూడా జనవరిలోనే విడుదల చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటించిన ఛారిత్రాత్మక చిత్రం 'పృథ్వీరాజ్‌' టీజర్ ను ఇటీవలే విడుదల చేశారు. టీజర్ లో ఈ సినిమాను జనవరిలో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. జనవరి 21న పృథ్వీరాజ్ విడుదల కాబోతుంది.

అంటే రాధే శ్యామ్‌ కు ఈ సినిమా గట్టి పోటీని ఇవ్వబోతుందని అంటున్నారు. ఆర్ ఆర్‌ ఆర్‌ రెండు వారాల ప్రభంజనం కారణంగా మొదటి వారంలో రాధే శ్యామ్‌ కు వసూళ్ల విషయంలో కాస్త నిరాశ తప్పదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సరే రెండవ వారంలో అయినా ప్రభాస్ గట్టిగా వసూళ్లు దక్కించుకుంటాడనుకుంటే ఇప్పుడు పృథ్వీరాజ్ రూపంలో ఆయనకు మరో షాక్ తగిలినట్లయ్యింది.

దాంతో రాధేశ్యామ్ కు మరియు ఇతర సినిమాలకు కూడా ఈ ఫైట్‌ ఎంతో కొంత నష్టం చేకూర్చడం ఖాయం అంటున్నారు. సినిమాల విడుదల విషయంలో నిర్మాతలు కాస్త చర్చించుకుని నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని.. లేదంటే జనవరి మరింత జఠిలం అయ్యి అందరికి నష్టం కలిగిస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Tags:    

Similar News