బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కొత్త సినిమా 'కేసరి' ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. 1897 లో జరిగిన బ్యాటిల్ ఆఫ్ సారగడి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. క్రూరంగా ఉండే 10000 మంది ఆఫ్ఘన్ తెగవారు బ్రిటిష్ ఇండియా(ఇప్పుడు పాకిస్తాన్) పై దాడిచేసినప్పుడు 21 మంది సిక్కులైన బ్రిటిష్ ఇండియన్ సైనికులు వారిని అడ్డుకొని తమ చెక్ పోస్ట్ ను కాపాడి.. తాము వీర మరణం పొందడమే స్థూలంగా ఈ సినిమా కథ.
ఇందులో ఆ గ్రూప్ కు నాయకత్వం వహించిన హవల్దార్ ఇషార్ సింగ్ పాత్రలో అక్షయ్ కుమార్ నటించాడు. "ఏక్ గోరె నే ముఝ్ సే కహా తుం గులాం హో.. హిందూస్తాన్ కీ మిట్టీ సే డర్ పోక్ పైదా హోతే హై. ఆజ్ జవాబ్ దేనే కా వక్త్ ఆగయా హై(ఒక తెల్లవాడు నాతో మీరు బానిసలని.. భారతదేశంలో పిరికివాళ్ళు పుడతారని అన్నాడు. ఇప్పుడు సమాధానం ఇవ్వాల్సిన సమయం వచ్చింది)" అంటూ ఒక పవర్ఫుల్ డైలాగ్ తో స్టార్ట్ అయింది. మరో సీన్లో అక్షయ్ కుమార్ వద్దకు మరికొందరు సిక్కులు రావడం.. వారు "మాకు ఏదైనా సైనికుల్లా ఉండే పని ఇప్పించండి. మేము పఠాన్ల తో యుద్ధం చేయడానికి వచ్చాం.. వాళ్ళ మసీదులు కట్టడానికి కాదు" అంటారు. "యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు చేద్దాం. ఇపుడు కాదు. మనం ఇప్పుడు దేవుడి ఇల్లు కడుతున్నాం.. ఆయనతో మనకేంటి గొడవ" అంటాడు. ఇలాంటి పవర్ఫుల్ డైలాగ్స్ ఇంకా ఉన్నాయి.
అక్షయ్ కుమార్ లుక్.. యాక్షన్ సీక్వెన్సులు అదిరిపోయాయి. ముఖ్యంగా తన పెర్ఫార్మన్స్ పీక్స్ లో ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా న్యాచురల్ గా అనిపిస్తున్నాయి. యాక్షన్ సీక్వెన్స్ లతో పాటుగా మరో హైలైట్ నేపథ్య సంగీతం. 'మగధీర' సినిమాలో చరణ్ ఒక్కడు 100 మంది చంపే ఎపిసోడ్ లో ఎలాంటి ఎమోషన్ వస్తుందో దానికి రెట్టింపు ఎమోషన్ ఉన్నట్టుంది. పైగా ఇది నిజంగా చరిత్రలో జరిగిన సంఘటన కాబాట్టి ప్రేక్షకులను డీప్ గా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ట్రైలర్ కు యూట్యూబ్ లో వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనాలు నమోదు చేయడం చేయడం ఖాయమే అనిపిస్తోంది. పరిణీతి చోప్రా ఈ సినిమాలో హీరోయిన్. హోలీ సందర్భంగా ఈ సినిమాను మార్చ్ 21 న రిలీజ్ చేస్తున్నారు. ఇక ఆలస్యం ఎందుకు.. 'కేసరి' ని చూసేయండి.
Full View