రోబో-2లో విలన్ పాత్ర చేస్తున్నావు కదా.. ఆ క్యారెక్టర్ గురించి, సినిమా గురించి కొన్ని విశేషాలు చెప్పవయ్యా అని అడిగితే.. ఏంటి నన్నా సినిమా నుంచి తప్పించేద్దామని చూస్తున్నారా అని ప్రశ్నిస్తున్నాడు బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్. శంకర్ తన సినిమాల విశేషాల్ని ఎక్కడా బయటకు పొక్కనీయకుండా చూసుకుంటాడన్న సంగతి తెలిసిందే. తన సినిమాకు పని చేసే నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, మిగతా యూనిట్ సభ్యులందరికీ కూడా ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలుంటాయి. అక్షయ్ కి కూడా ఆ కోడ్ గురించి బాగానే అవగాహన వచ్చేసినట్లుంది. తన కొత్త సినిమా ‘ఎయిర్ లిఫ్ట్’ ప్రమోషన్ కోసం వచ్చిన అక్షయ్ ని రోబో-2 గురించి అడిగితే నోరే తెరవలేదతను.
‘‘రోబో-2 సినిమా పూర్తయ్యాక దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడే అధికారం నాకు లేదు. నన్నా సినిమా నుంచి తప్పించేయాలనుకుంటా దాని గురించి మళ్లీ ప్రశ్నించండి’’ అని సెలవిచ్చాడు అక్షయ్. దీంతో విలేకరులు మళ్లీ అతణ్ని రోబో-2 గురించి అడగలేదు. ఐతే ‘ఎయిర్ లిఫ్ట్’ గురించి మాత్రం అక్షయ్ చాలా విశేషాలే చెప్పాడు. ఇలాంటి సినిమాలో భాగమైనందుకు తనకు గర్వకారణంగా ఉందని.. ఈ సినిమా చూసి ప్రతి భారతీయుడూ కూడా గర్విస్తాడని.. తన కెరీర్లో ఈ సినిమా ఓ మైలు రాయి అని తెలిపాడు. 1990లో కువైట్ పై ఇరాక్ దాడి జరిపినపుడు అక్కడ చిక్కుకున్న లక్షా 70 వేల మంది భారతీయుల్ని ఇండియన్ ఆర్మీ సాయంతో ఓ ఎన్నారై ఎలా రక్షించి భారత్ కు తీసుకురాగలిగాడనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ నెల 22న ‘ఎయిర్ లిఫ్ట్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.