పాకిస్తాన్ లో ప్యాడ్ వద్దన్నారు

Update: 2018-02-12 10:10 GMT
ఒకపక్క అక్షయ్ కుమార్ ప్యాడ్ మ్యాన్ సినిమాకు ప్రపంచం మొత్తం నీరాజనాలు పలుకుతుంటే పాకిస్తాన్ మాత్రం తన సహజ ధోరణిలో దీనికి అనుమతి ఇవ్వడానికి నో చెప్పేసింది. సినిమాలకు సంబంధించి వ్యవహారాలు చూసే ఫెడరల్ సెన్సార్ బోర్డు దీనికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించింది. గతంలో టైగర్ జిందా హై విషయంలో కూడా ద్వంద్వ వైఖరి పాటించిన పాక్ ప్యాడ్ మ్యాన్ విషయంలో కూడా అదే కంటిన్యూ చేసింది. తమ సంప్రదాయాలకు, సంస్కృతికి భిన్నంగా ఉన్న కారణంగా ప్యాడ్ మ్యాన్ సినిమాను అనుమతించలేమని పాక్ తేల్చి చెప్పింది. దీంతో ఈ సినిమాను కొన్న అక్కడి డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద షాకే తగిలింది. ఇలా భారతీయ సినిమాలను నిరోధించుకుంటూ పోతే ఆఖరికి థియేటర్లు మూతబడే పరిస్థితి రావొచ్చని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎంఎస్ ధోని మొదలుకొని ఎక్ థా టైగర్ - టైగర్ జిందా హై - డి డే - ఫాంటమ్ ఇలా ఎన్నో సినిమాల విషయంలో పాక్ ఇలాగే వ్యవహరించింది. పద్మావత్ విషయంలో ఒక నిపుణుడి సలహా మేరకు సర్టిఫికేట్ జారీ చేసినప్పటికి ఇంకా అక్కడ విడుదల కావడంలో ఆలస్యం జరుగుతోంది. ఓవర్సీస్ మార్కెట్ బలంగా ఉన్న బాలీవుడ్ సినిమాలకు పాకిస్తాన్ లో మాత్రమే బ్యాన్ చేయటం వల్ల వచ్చిన అపార నష్టం ఏమి లేనప్పటికీ అక్కడి వర్గాలు అనుసరిస్తున్న వైఖరి మాత్రం అభ్యంతరకరమే.

కొత్తగా భారతీయ సినిమాలతో సహా ఇతర దేశాల నుంచి సినిమాలను దిగుమతి చేసుకునే విషయంలో కొన్ని నిబంధనలు తీసుకొచ్చే ఆలోచనలో ఉంది అక్కడి సెన్సార్ బోర్డు. అయినా ఒక సద్దుదేశంతో తీసిన ప్యాడ్ మ్యాన్ లాంటి సినిమాకు కూడా ఇలా అడ్డంకి ఏర్పడటం పట్ల సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. సో ప్యాడ్ మ్యాన్ రిలీజ్ పాకిస్థాన్ లో లేనట్టే. అక్షయ్ కుమార్ రాబోయే చిత్రం గోల్డ్ కూడా అక్కడ విడుదల నోచుకునే అవకాశాలు తక్కువే. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం గొప్పదనం చాటేలా ఉన్న ఆ స్పోర్ట్స్ డ్రామాను కూడా అడ్డుకుంటారు అని వేరే చెప్పాలా.
Tags:    

Similar News