ప్రభుదేవాకి ఫ్లాటైపోయిన ఫారిన్ పోరి

Update: 2015-07-26 08:24 GMT
ఎవడు సినిమాలో రామ్‌ చరణ్‌తో ఆడిపాడిన అమీ జాక్సన్... ప్రభుదేవా కి ఫ్లాట్ అయిపోయిందట! ఈ విషయాన్ని తానే వెళ్లి ప్రభుదేవాకి చెప్పింది కూడా. కష్టపడి వచ్చీ రాని హిందీ పదాలను కూడబలుక్కుని మరీ... 'మై తుమ్ పర్ ఫిదా హూ' అనిందట. అది కూడా ఇప్పుడు ప్రభుదేవా తీస్తున్న సింగ్ ఈజ్ బ్లింగ్ సెట్స్ మీదే. అమీ నోటి వెంట ఈ మాట వినేసరికి... ప్రభుదేవాకి ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయిపోయింది.

అసలు అమీ జాక్సన్‌ కి ఇంగ్లీష్ తప్ప ఒక్క ముక్క కూడా హిందీ రాదు. అలాంటిది మరి ఎందుకింత కష్టపడి మరీ ఈ వాక్యం నేర్చుకుందా అని తీరా తీస్తే... అసలు విషయం బైట పడింది. అమీని ఆట పట్టించేందుకు హీరో అక్షయ్ కుమార్ ఓ ప్లాన్ వేశాడు. ఈ సెంటెన్స్ నేర్పించి... ప్రభుదేవా దగ్గరకు పంపాడు. దీనర్ధం తెలీని అమీ... అమాయకంగా వెళ్లి పాఠం అప్పచెప్పినట్లు చెప్పేసింది.

విషయం తెలిశాక అమ్మయితో సహా... యూనిట్ అంతా నవ్వుకున్నారనుకోండి. అదీ సంగతి. భాష తెలీకపోతే ఇలాంటి సమస్యలే వస్తాయి. అయినా... హీరో కదా అని... ఏది చెబ్తే అది చేసేయడమే. అమ్మో అమీ... జాగ్రత్త ఇకనైనా.
Tags:    

Similar News