బాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరో.. అత్యధికంగా పారితోషికం తీసుకుంటున్న హీరో.. ఏడాదికి ఎక్కువ సినిమాలు చేస్తున్న హీరో.. ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్న హీరో అక్షయ్ కుమార్ మాత్రమే. ప్రస్తుతం వందల కోట్ల సినిమాలను సునాయాసంగా చేసేస్తున్న అక్షయ్ కుమార్ కు కపిల్ కామెడీ షో ద్వారా అవమానం ఎదురైంది. ఆ షో ను అక్షయ్ అనధికారికంగా బహిష్కరించినట్లుగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తన మాట కాదని.. తన పరువు తీసేలా ఆ షో నిర్వాహకులు చేశాడంటూ అక్షయ్ కుమార్ ఆగ్రహంతో ఉన్నాడట. ఈ విషయంలో ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.
ఉత్తరాది ప్రేక్షకులకు మాత్రమే కాకుండా సౌత్ ప్రేక్షకులకు కూడా సుపరిచితం అయిన కపిల్ శర్మ షో లో కొన్నాళ్ల క్రితం అక్షయ్ కుమార్ ఒక సినిమా ప్రమోషన్ నిమిత్తం పాల్గొన్నాడు. ఆ సమయంలో బీజేపీ పై పంచ్ వేస్తూ అక్షయ్ మాట్లాడాడు. అయితే చాలా కాలంగా కూడా బీజీపీకి మోడీకి మద్దతుగా అక్షయ్ వ్యవహరిస్తూ వస్తున్నాడు. ఆ కారణంగా తాను సరదాగా.. ఫ్లో లో వేసిన బీజేపీ వ్యతిరేక పంచ్ ను తొలగించాల్సిందిగా ఆ సమయంలోనే అక్షయ్ కుమార్ షో నిర్వాహకులకు మరియు కపిల్ శర్మకు తెలియజేశాడట. ఆ సమయంలో ఎడిటింగ్ లో ఆ పంచ్ ను తొలగిస్తామని చెప్పిన షో నిర్వాహకులు ఆ తర్వాత దాన్ని అలాగే ప్రసారం చేశారు. దాంతో అక్షయ్ కుమార్ కు కోపం వచ్చింది. తాను అంతగా చెప్పినా కూడా మాట లెక్క చేయకుండా కావాలని ఆ డైలాగ్ ను ఉంచారంటూ అక్షయ్ కుమార్ ఇకపై ఆ షో కు వెళ్ల కూడదు అనే నిర్ణయానికి వచ్చాడని సమాచారం.
బాలీవుడ్ సినిమాలను సుదీర్ఘ కాలంగా కపిల్ శర్మ తన షో ద్వారా ప్రమోట్ చేస్తూ వస్తున్నాడు. స్టార్ హీరోల మెజార్టీ సినిమాలకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు విడుదలకు ముందు వారం లేదా రెండు వారాల ముందు ఖచ్చితంగా కపిల్ శర్మ షో ను ఆశ్రయించడం జరుగుతుంది. పెద్ద సినిమాలను ప్రమోట్ చేసే షో గా కపిల్ శర్మ షో కు గుర్తింపు ఉంది. కనుక ఆ షో కు మంచి రేటింగ్ కూడా ఉంటుంది. అలాంటి షో ను ఇప్పుడు అక్షయ్ బహిష్కరించడంతో ఆయన నటించిన నటించబోతున్న సినిమాల ప్రమోషన్ విషయంలో కాస్త ఇబ్బంది కలిగే అవకాశం ఉందని అంటున్నారు. కపిల్ షో లో సినిమాలను ప్రమోట్ చేస్తే మంచి రీచ్ వస్తుందనే నమ్మకం ఉంటుంది. అందుకే నిర్మాతలు కపిల్ షో లో తమ సినిమాలను ప్రమోట్ చేసేందుకు ఇష్టపడుతూ ఉంటారు. మరి ఇప్పుడు అక్షయ్ తీసుకున్న నిర్ణయం నిర్మాతలకు ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంది. కనుక ముందు ముందు అయినా అక్షయ్ కుమార్ తన నిర్ణయాన్ని మార్చుకుంటాడేమో చూడాలి.