మోడీని పొగిడిన అక్షయ్ దొరికిపోయాడు

Update: 2019-05-02 08:31 GMT
సినిమాలు, రాజకీయాలు వేరు.. కానీ సినిమా నటులే రాజకీయాలను ఏలుతున్న రోజులివీ.. ఎన్టీఆర్ నుంచి ఎంజీఆర్, జయలలిత వరకూ అంతా సినిమా స్టార్లే రాజ్యాలు ఏలారు. తెలుగు రాష్ట్రాల్లోనూ మొన్నటి ఎన్నికల వేళ ఇదే ఔచిత్యం చోటుచేసుకుంది. టాలీవుడ్ ప్రముఖులంతా పార్టీల వెంట పడి వాటికి సపోర్ట్ చేశారు.

ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల వేళ కూడా మోడీ చాలా మంది సినీ ప్రముఖులకు గాలం వేశారు. ఆ గాలం చిక్కిన చేప ఒకటే.. అతడే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. అక్షయ్ మోడీని ఇంటర్వ్యూ చేయడం.. మోడీని భజనం చేయడం చూశాక అతడిని అభిమానించిన కొందరు అభిమానులు కూడా ఇదేంటని ముక్కున వేలేసుకున్నారు.

అక్షయ్ ముందు నుంచి బీజేపీకి అనుకూలంగా రాజకీయం నడిపారు. అక్షయ్ సినిమాల్లో బీజేపీ పార్టీ పథకాలు ఉండేవి. ఇతోదికంగా బీజేపీని తన సినిమాల ద్వారా ఫోకస్ చేసి బీజేపీ వాదిగా అక్షయ్ మారిపోయాడు. స్వచ్ఛభారత్ ను అక్షయ్ ప్రచారం చేశారు. ఇలా వ్యక్తిగతంగా అక్షయ్ బీజేపీ మనిషి. కానీ ఇంత అభిమానం ఉన్న అక్షయ్ కుమార్ కు ఇక్కడ ఓటు హక్కే లేకపోవడం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది.

నిజానికి అక్షయ్ భారతీయుడే అయినా ఆయనకు భారత పౌరసత్వం లేదు. కెనడా దేశ పౌరసత్వం ఉంది. అంటే కెనడా దేశస్థుడేనన్న మాట.. దేశానికి చెందిన వ్యక్తే కాకపోవడం.. ఇక్కడ ఓటు హక్కు లేకపోవడం.. అయినా మోడీ భజనం చేయడం చూశాక అందరూ సెటైర్లు వేస్తున్నారు.

మొన్నటి ఎన్నికల్లో అక్షయ్ ఓటు వేయలేదు. ఆయన భార్య ఓటేసింది. అప్పుడే అక్షయ్ కు భారతీయ పౌరసత్వం లేదని అర్థమైంది. ఇప్పుడు భారత పౌరసత్వం లేని అక్షయ్ మోడీ భజనం చేయడం ఏంటని నెటిజన్లు ఆయన్ను సోషల్ మీడియాలో కడిగేస్తున్నారు. ఓటు కూడా లేని వ్యక్తివి ఎలా ప్రశ్నిస్తావని అంటున్నా నోరు మెదపడం లేదు అక్షయ్.
    

Tags:    

Similar News