ప్రోమోలో ఆ ప‌దాన్ని సెన్సార్ చేశారు.. హీరో బాధ‌!

Update: 2019-12-25 09:20 GMT
త‌న తాజా సినిమా 'గుడ్ న్యూజ్' విష‌యంలో సెన్సార్ తీరు పై బాధ‌ప‌డుతున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్. ఇన్-విట్రో ఫెర్టిలైజేష‌న్ (ఐవీఎఫ్) ప‌ద్ధ‌తిలో గ‌ర్భాన్ని పొంద‌డం కాన్సెప్ట్ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఇందులో క‌రీనా క‌పూర్, కియ‌రా అద్వానీ త‌దిత‌రులు కూడా న‌టించారు. ఈ సినిమా త్వ‌ర‌లోనే విడుద‌ల‌కు రెడీ అవుతోంది.

ఇలాంటి నేప‌థ్యంలో అక్ష‌య్ కుమార్ త‌మ సినిమా ప్రోమోకు వ‌చ్చిన క‌ష్టాల గురించి చెప్పుకున్నాడు. సినిమా ప్రోమోలో 'స్పెర్మ్' అనే ప‌దాన్ని సెన్సార్ వాళ్లు మ్యూట్ చేశార‌ని అక్ష‌య్ అంటున్నాడు. ఈ సినిమా రూపొందించేందే కృత్రిమ ప‌ద్ధ‌తిలో గ‌ర్భం పొంద‌డం గురించి. కాబ‌ట్టి అలాంట‌ప్పుడు స్పెర్మ్ అనే ప‌దం స‌హ‌జంగానే వినిపించి ఉండ‌వ‌చ్చు.

కానీ త‌మ సినిమా కాన్సెప్ట్ ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా సెన్సార్ బోర్డు.. వీర్యం అనే ప‌దాన్ని వినిపించ‌కుండా చేసింద‌ని అక్ష‌య్ అంటున్నాడు. దీని వ‌ల్ల త‌మ సినిమా ప్రోమో జ‌నాల‌కు అర్థం కాకుండా త‌యార‌వుతోంద‌ని అంటున్నాడు. స్పెర్మ్ అనే ప‌దం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా మ్యూట్ చేయ‌డం వ‌ల్ల ప్రోమో జ‌నాల‌కు స‌రిగా క‌నెక్ట్ కాదేమోన‌ని అక్ష‌య్ కుమార్ చెబుతున్నాడు.

బోల్డ్ కాన్సెప్టుల‌తో సినిమాలు తీసిన‌ప్పుడు ఇలాంటి ఇబ్బందులు త‌ప్ప‌క‌పోవ‌చ్చు ఎవ‌రికైనా. ఇక ఐవీఎఫ్ ప‌ద్ధ‌తి గురించి కూడా చాలా మంది గ‌ట్టిగా మాట్లాడ‌టానికి ఇష్ట‌ప‌డ‌ర‌ని.. దాని గురించి గుస‌గుస‌లాడుకుంటార‌ని అక్ష‌య్ అన్నాడు. మ‌రి అలాంటి కాన్సెప్ట్ తో తీసిన సినిమాకు వ‌సూళ్లు ఎలా ఉంటాయో మ‌రి!


Tags:    

Similar News