హిందీ సినిమాలు చూసేవారికి అక్షయ్ ఖన్నా పేరు తెలిసే ఉంటుంది. వినోద్ ఖన్నా వారసుడిగా 22 ఏళ్ళ క్రితం బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అక్షయ్ ఖన్నా కెరీర్ మొదట్లో బాగానే సాగింది. అక్షయ్ కెరీర్ లో 'దిల్ చాహతా'.. 'రేస్'.. 'తాల్'.. 'హమ్రాజ్'.. 'హంగామా' లాంటి హిట్ చిత్రాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్నాడు కానీ చెప్పుకోదగ్గ హిట్లు లేవు. రీసెంట్ గా 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' చిత్రంలో సంజయ్ బారు పాత్రలో నటించాడు.
సినిమాల విషయం పక్కన పెడితే అక్షయ్ రీసెంట్ గా ముంబైలో కెమెరా కంటికి చిక్కాడు. బాలీవుడ్ సెలబ్రిటీలను ఒక గూఢచారిలా ఫాలో అయ్యే వైరల్ భయాని ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతాలో షేర్ చేయడంతో ఈ ఫోటో ఒక్కసారిగా వైరల్ అయింది. అక్షయ్ పెద్ద స్టార్ ఏమీ కాదు.. మరి అంత సీన్ ఏముందని మీకు అనుమానం రావచ్చేమో. విషయం ఏంటంటే ఈ ఫోటోలో అక్షయ్ ఖన్నా అచ్చుగుద్దినట్టుగా హాలీవుడ్ యాక్షన్ స్టార్ జేసన్ స్టేథమ్ లా కనిపిస్తున్నాడని చాలామంది నెటిజన్లు కామెంట్లు పెట్టారు. మీరు 'కొత్తగా ఈ జేసన్ ఎవరు?' అని అడిగి షాక్ ఇవ్వకండి. ఆయన 'ట్రాన్స్ పోర్టర్' సీరీస్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో. సహజంగా బాల్డ్ హెడ్ ఉన్నవారు విగ్గులపై ఆధారపడతారు.. లేదా హెయిర్ వీవింగ్ చేయించుకుంటారు.. కానీ జేసన్ ఆ బాల్డ్ హెడ్ నే తన బ్రాండ్ లా మార్చుకున్నాడు. జుత్తు లేకపోయినా ఎంతో స్టైలిష్ గా కనిపించడం ఆయన ప్రత్యేకత. గతంలో అలా బ్రూస్ విల్లీస్ అని యాక్షన్ హీరో ఉండేవారు. ఇప్పుడు జేసన్ స్టేథమ్. మన అక్షయ్ ఖన్నా సరిగ్గా అలానే కనిపిస్తున్నాడు.
అక్షయ్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే అజయ్ బాల్ దర్శకత్వంలో 'సెక్షన్ 375' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇదో కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కుతోందని సమాచారం. ఈ సినిమాలో అక్షయ్ ఒక క్రిమినల్ లాయర్ పాత్రలో నటిస్తున్నాడు. నేరంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయవాదుల నుంచి సహకారం అందాలని.. ఒక రేపిస్ట్ తరఫున అయినా చట్టపరంగా ఒక న్యాయవాది వాదించాలి అని నమ్మే వ్యక్తిగా అక్షయ్ ఖన్నా కనిపిస్తాడట. ఈ వెర్షన్ అందరూ ఒప్పుకోకపోవచ్చు కానీ అక్షయ్ పాత్ర చిత్రణే ఈ సినిమాకు హైలైట్ అని సమాచారం.