సంక్రాంతి బరిలో నువ్వా నేనా అంటూ నాలుగు సినిమాలు ఒకదానితో ఒకటి పోటీపడుతూ రిలీజవుతున్నాయి. ఇందులో అల్లు అర్జున్ నటించిన `అల వైకుంఠపురములో` ఒకటి. జనవరి 12న ఈ చిత్రం రిలీజవుతోంది. ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్- గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.
రిలీజ్ కి సరిగ్గా ఇంకో 11 రోజులే సమయం ఉంది. ఈ మంగళవారం డిసెంబర్ 31 మిడ్ నైట్ పార్టీకి ప్రపంచమంతా రెడీ అవుతోంది. ఈ సందర్భంగా అల టీమ్ ఏదైనా స్పెషల్ గ్లింప్స్ ప్లాన్ చేస్తుందా? అన్నది చూడాలి. అదంతా అలా ఉంటే .. ఈ సినిమా రిలీజ్ కి మరో ఇరవై రోజులు ఉంది అనగా ఇంకా త్రివిక్రముడు మెరుగులు దిద్దేందుకు చాలానే చేశారట. ఇప్పుడు కేవలం 10-11 రోజుల సమయమే బ్యాలెన్స్. ఇంకా ఏదో ఒకటి చేస్తూనే ఉండడడం హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటికే ఫస్టాఫ్ ని పక్కాగా లాక్ చేసేశారు. సెకండాఫ్ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తవుతున్నాయి. ఇప్పటికే థమన్ రీరికార్డింగ్ పనుల్లో ఉన్నాడు. ఇకపోతే జనవరి 12న రిలీజ్ అని ఇంతకుముందు చెప్పినా.. మరోసారి అధికారికంగా పోస్టర్ అయితే రాలేదు ఎందుకనో. అన్ని వైపుల నుంచి టీమ్ పై ఒత్తిడి ఉంది. ఈ సినిమా ఎంత నిడివితో ఉండనుంది అన్నది ఇంకా డిసైడ్ కావాల్సి ఉంది. త్రివిక్రమ్ అండ్ టీమ్ డెడ్ లైన్ ప్రకారం రిలీజ్ చేసేందుకు దీనిపైనే అహోరాత్రులు శ్రమిస్తున్నారట. నా పేరు సూర్య లాంటి ఫ్లాప్ తర్వాత బన్ని ఎంతో శ్రద్ధ పెట్టి చేసిన చిత్రమిది. భారీ అంచనాల నడుమ రిలీజవుతోంది. బన్ని ఫ్యాన్స్ లో ఆ మేరకు ఉత్కంఠ నెలకొంది.