తిరుప‌తి లో అల స్పెష‌ల్ ఈవెంట్ ర‌ద్దు

Update: 2020-01-23 07:18 GMT
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సంక్రాంతికి అల వైకుంఠ‌పుర‌ములోతో సాలిడ్ స‌క్సెస్ అందుకున్నాడు. నా పేరు సూర్య డిజాస్ట‌ర్ రిజ‌ల్ట్ ను మ‌రిపిస్తూ.. అల‌.. బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం రెట్టింపు ఉత్సాహాన్ని నింపింది. ప్ర‌స్తుతం బ‌న్నీ ఫుల్ హ్యీపీ మూడ్ లో ఉన్నాడు. ఇటీవ‌లే వైజాగ్ బీచ్ లో విజ‌యోత్స వేడుక‌ ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఏపీకి కాబోయే సినిమాటోగ్ర‌ఫీ మంత్రి.. ప్ర‌స్తుత ప‌ర్యాట‌క శాఖామాత్యులు ముత్తంశెట్టి  శ్రీనివాస‌రావు ముఖ్య అతిథిగా విచ్చేసి యూనిట్ కి విషెస్ తెలియ‌జేసారు.

ఇంకా ఇలాంటి మ‌రెన్నో వేడుక‌ల‌ను అల టీమ్ ప్లాన్ చేస్తోంది. దీనిలో భాగంగా శుక్ర‌వారం తిరుప‌తి లో ఫ్యాన్స్ కోసం స్పెష‌ల్ గా ఓ ఈవెంట్ ను ప్లాన్ చేసారు. అయితే బుధ‌వారం బ‌న్నీ మేన‌మామ రాజేంద్ర ప్ర‌సాద్ క‌న్నుమూయ‌డం తో ఆ ఈవెంట్ ను ర‌ద్దు చేసారు. ఆయ‌న మ‌ర‌ణం తో బ‌న్నీ కుటుంబం లో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. స‌క్సెస్ వ‌చ్చింద‌ని సంతోషిస్తున్న టైమ్ లో ఈ ఘ‌ట‌న ఆ కుటుంబానికి శోకాన్ని మిగిల్చింది. ఇప్ప‌టికే బ‌న్నీ స‌హా కుటుంబ స‌భ్యులంతా విజ‌య‌వాడ‌ కు చేరుకుని.. నివాళులు అర్పించారు.

ఈ ఘ‌ట‌న తో కొద్ది రోజుల పాటు అల స‌క్సెస్ వేడుక‌ల ఆలోచ‌న‌ను విరమించిన‌ట్టేన‌ని చెబుతున్నారు. రాజేంద్ర ప్ర‌సాద్ ద‌శ‌దిన కార్య‌క్ర‌మాలు పూర్త‌యిన త‌ర్వాతే ఏదైనా. బ‌న్ని-సుకుమార్ కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌నున్న ఏఏ 21 సినిమాకు కీ.శే ముత్తంశెట్టి రాజేంద్ర ప్ర‌సాద్ ఒక‌ నిర్మాత‌గా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆయ‌న మ‌ర‌ణంతో మైత్రి సంస్థ అధినేత‌లు త‌మ దిగ్భ్రాంతి ని వ్య‌క్తం చేశారు.
Tags:    

Similar News