జాలీ ఆలీ బాగా మారిపోయాడే

Update: 2016-01-31 05:57 GMT
ఆలీ ఎక్కడుంటే అక్కడ నవ్వులే నవ్వులు. తన మాటలు, చేష్టలతో విపరీతంగా నవ్వించేయడం ఆలీ స్టైల్. ఆన్ స్క్రీన్ పైనే కాదు.. ఆఫ్ స్క్రీన్ కూడా విపరీతంగా నవ్వించగల సత్తా ఈ కమెడియన్ సొంతం. కానీ ఒకోసారి ఈ కామెంట్స్ శృతి మించిపోవడంతో.. ఈ మధ్య వివాదాలు బాగా ఎక్కువయ్యాయి. అసలు గత కొంత కాలంగా ఆలీ పేరు కాంట్రవర్సీల మధ్యే వినిపించింది. ముఖ్యంగా హీరోయిన్లపై ఆలీ చేసిన కామెంట్స్ చాలా వివాదం సృష్టించాయి. అనుష్క తొడలపై చేసిన వ్యాఖ్యలు వీటన్నిటిలోకి చాలా కీలకం.

కేవలం కామెడీ కోసమే అని ఆలీ సమర్ధించుకున్నా.. పెద్దగా సపోర్ట్ రాలేదు.దీంతో ఇప్పుడు ఆలీ తన పద్ధతి మార్చేసుకున్నట్లుగా కనపిస్తున్నాడు. ఇలాంటి వివాదాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా అనిపిస్తోంది. ఆడియో ఫంక్షన్ల హోస్టింగ్ కు దూరంగా ఉండడమే కాదు.. కనీసం మాట్లాడడం కూడా బాగా తగ్గించాడు. రీసెంట్ గా ఓ ఫంక్షన్ లో ఆలీతో మాట్లాడించేందుకు యాంకర్ శ్యామల బాగా ప్రయత్నించింది. ఆలీతో కామెంట్స్ చేయించడానికి తెగ ట్రై చేసింది. కానీ ఆలీ మాత్రం అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం ఇవ్వడం తప్ప.. అనవసరంగా ఒక్క అక్షరం కూడా మాట్లాడలేదు.

ఆలీ కాలు పట్టుకు లాగేందుకు ట్రై చేసినా సరే, సున్నితంగా ఎస్కేప్ అయిపోయాడు ఆలీ. తనలాంటి సెలబ్రిటీ బాధ్యతగా వ్యవహరించాల్సిన వాస్తవాన్ని ఆలీ అర్ధం చేసుకున్నాడని అనుకుంటున్నారు. ఏమైనా మార్పు మంచిదే కదా.

Tags:    

Similar News