పోసాని మంట‌: ప‌వ‌న్ క‌ల్యాణ్ రోల్ లో అలీ?

Update: 2019-04-15 05:01 GMT
రాజ‌కీయాలు స్నేహితుల్నే కాదు సొంత వారిని కూడా శ‌త్రువులుగా మారుస్తాయి అన‌డానికి తాజాగా జ‌రిగిన ఎన్నిక‌లే నిలువెత్తు నిద‌ర్శ‌నం. ఇటీవ‌ల ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో అలీ వైసీపీ లో చేరి ప్ర‌చారం చేసిన విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత జ‌రిగిన నాట‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన బ‌హ‌రంగ స‌భ‌లో జ‌న‌సేనాని ప‌వ‌న్‌ క‌ల్యాణ్ వైసీపీలో అలీ చేర‌డాన్ని త‌ప్పుప‌ట్టారు. అత‌నికి స‌హాయం చేశాన‌ని, అత‌ని బంధువుల‌కు టికెట్‌ లు కూడా ఇచ్చాన‌ని జ‌నం సాక్షిగా ప్ర‌క‌టించ‌డంతో అలీ హ‌ర్ట్ అయ్యారు.

ఆ త‌రవాత ప‌వ‌న్‌ ని ప్ర‌శ్నిస్తూ అలీ ఓ వీడియోని కూడా విడుద‌ల చేశారు. ఎప్పుడు ఎలా త‌న‌కు స‌హాయం చేశారో చెప్పాల‌ని, వేషం ఇప్పించారా?. అవ‌స‌రానికి డ‌బ్బులు ఇచ్చారా? అని నిల‌దీయ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య పెద్ద అగాధ‌మే ఏర్ప‌డింది. దానికి పోసాని కృష్ణ‌ముర‌ళి మ‌రింత ఆజ్యం పోశారా అంటూ మాట్లాడుకోవ‌డం విశేషం. పోసాని కృష్ణ‌ముర‌ళి రాజ‌కీయ నేప‌థ్యంలో `ముఖ్య‌మంత్రిగారు మీరు మాటిచ్చారు` పేరుతో స్వీయ నిర్మాణంలో ఓ వ్యంగ్య చిత్రాన్ని నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. పోసాని ప్లాన్ ప్ర‌కారం ఈ చిత్రాన్ని ఏపీ ఎన్నిక‌ల‌కు ముందే విడుద‌ల చేయాలి. కానీ ఈసీ అభ్యంత‌రం, టీడీపీ నేత‌ల అతి జాగ్ర‌త్త వ‌ల్ల విడుద‌ల ఆల‌స్య‌మైంది.

ఈ చిత్రంలో చంద్ర‌బాబు పాత్ర‌తో పాటు జ‌న‌సేనాని ప‌వ‌న్‌ క‌ల్యాణ్ పాత్ర కూడా వుంద‌ట‌. 2014 ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఈ సినిమా క‌థ సాగుతుంద‌ని తెలిసింది. ఆ స‌మ‌యంలో చంద్ర‌బాబుకు ప‌వ‌న్ మ‌ద్ద‌తుగా నిలిచిన విష‌యం తెలిసిందే. ఆ పాత్ర‌లో అలీ క‌నిపిస్తార‌ని, ఈ పాత్ర‌ని తీర్చిదిద్దిన తీరు ప‌వ‌న్‌ పై సెటైరిక‌ల్‌ గా వుంటుంద‌ని వినిపిస్తోంది. ఇంత తెలిసీ స్నేహితుడిని కించ‌ప‌రిచే పాత్ర‌ని అలీ ఎందుకు చేసిన‌ట్టు అన్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. దీనికి అలీ ఏమ‌ని స‌మాధానం చెబుతారో చూడాలి. మెగా ఫ్యాన్స్ దీనిపై ఎంత వైల్డ్‌ గా స్పందిస్తారో  అన్న సందేహాలు ఉన్నాయి. ఇక ప‌వ‌న్ కంటే నేనే సీనియ‌ర్ అని చెప్పిన అలీ ఎంత‌కైనా వెళ్లేందుకే నిర్ణ‌యించుకున్నారా?
Tags:    

Similar News