డాడీలో వెంకటేష్.. కానీ చిరు ఎందుకు చేశాడు..?
ఐతే హీరో అంటే అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించాలి అందుకే ఒక్కోసారి తప్పక కొన్ని సినిమాలు చేయాల్సి ఉంటుంది.
కొన్ని సినిమాలు కథ విన్నప్పుడే ఇది తమకు సూట్ అవుతుందా లేదా అన్న ఆలోచన స్టార్స్ కు ఉంటుంది. స్టార్ హీరోలు వారికి ఉన్న ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకుని సినిమాలు చేస్తారు. ఒక్కోసారి ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేయాలని ప్రయోగాలు చేస్తే వాళ్లు సర్ ప్రైజ్ అవ్వడం అటుంచితే తమ ఖాతాలో ఒక ఫెయిల్యూర్ వచ్చి చేరుతుంది. అందుకే కొందరు స్టార్స్ తమ జోనర్ కాని కొన్ని సినిమాలను అసలు టచ్ చేయడానికి కూడా ఇష్టపడరు. ఐతే హీరో అంటే అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించాలి అందుకే ఒక్కోసారి తప్పక కొన్ని సినిమాలు చేయాల్సి ఉంటుంది.
ఇంతకీ ఈ లీడ్ అంతా దేనికి అంటే మెగా మాస్ ఇమేజ్ ఉన్న మెగాస్టార్ చిరంజీవి డాడీ లాంటి ఎమోషనల్ మూవీ చేస్తారని ఊహించి ఉండరు. ఐతే ఆ సినిమా కథ విన్నప్పుడే ఇది తనకన్నా వెంకటేష్ కు బాగుంటుందని అన్నారట చిరంజీవి. ఐతే దర్శకుడు సురేష్ కృష్ణ, రైటర్ భూపతి రాజా చిరుని కన్విన్స్ చేశారట. వెంకటేష్ చేస్తే రొటీన్ గా ఉంటుంది. మీకైతే వెరైటీగా ఉంటుందని అన్నారట. ఫ్యామిలీ మెన్ గా మీరు చేస్తే బాగుంటుందని చిరుని డాడీకి ఒప్పించారట.
ఐతే రిలీజ్ తర్వాత సినిమా రిజల్ట్ కూడా చిరుని సంతృప్తి పరచలేదు. ఏదో యావరేజ్ గా ఆడింది. ఐతే సినిమా చూసిన చాలామంది ఇది వెంకటేష్ కి పడాల్సిన సినిమా అన్నారు. డాడీ రిలీజ్ టైం లో వెంకటేష్ కూడా సినిమా చూసి మనకైతే బాగుండేదని అన్నాడట. ఐతే చిరు నేను కూడా అదే చెప్పాను కానీ వినలేదని అన్నారట. ఇలా తాను కథ విన్నప్పుడే వద్దనుకుని చేసిన సినిమాలు కొన్ని తనకు చేదు అనుభవాలను మిగిల్చాయని ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి చెప్పారు.
హీరోలు తాము చేసే సినిమాలను బట్టి వారికి ఒక ఇమేజ్ వస్తుంది. ఐతే ఎప్పుడు అలాంటి సినిమాలే చేయాలని కాదు కానీ ఫలానా జోనర్ ఈ హీరో బాగా చేస్తాని అనిపిస్తుంది. అలాంటి భావన ఉన్నప్పుడు వెరైటీగా ఏదో ప్రయోగం చేద్దామని అనుకుంటే మాత్రం ఫలితాలు తారుమారయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకు చిరంజీవి డాడీ సినిమా ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు. ఐతే సినిమా జస్ట్ ఓకే అనిపించేలా ఫలితం దక్కించుకున్నా మెగా ఫ్యాన్స్ కు మాత్రం అది ఎంతో స్పెషల్ సినిమాగా నిలిచిందని చెప్పొచ్చు.