మిల్కీబ్యూటీ ఎంట్రీ ఇండస్ట్రీకి అలా!
మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్ 15 ఏళ్లగా దేదీప్యమానంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే. సీనియర్ నాయికగా ఇంకా సత్తా చాటుతూనే ఉంది.
మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్ 15 ఏళ్లగా దేదీప్యమానంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే. సీనియర్ నాయికగా ఇంకా సత్తా చాటుతూనే ఉంది. కొత్త భామలెంత మంది వచ్చినా? తనకు పోటీ కాదంటూ దూసుకుపోతుంది. ఇటీవలే `సికిందర్ కా ముఖద్దర్` సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం నెట్ ప్లిక్స్ లో ప్రసారమవుతోంది. ఈ సందర్భంగా అమ్మడు కెరీర ప్రస్తానం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
`సినిమాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. నా ఎంట్రీ అనుకోకుండా జరిగింది. 15 ఏళ్లగా నటిగా కొనసాగుతున్నా. ప్రతీ సినిమా ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నా. ఎంతో మంది గొప్ప నటులతో కలిసి పనిచేసాను. ఆరంభంలో తెలుగు, తమిళ్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలు చేసాను. అయినప్పటికీ నటిగా ఏదో చేయాలనే తప్పన ఇంకా నాలో తగ్గలేదు. విభిన్నమైనవి, నన్ను సవాల్ చేసే పాత్రలు చేయాలనిపించింది.
కమర్శియల్ గా సక్సెస్ అందుకున్న తర్వాత ప్రయోగాలు చేయడం అనవసరం అని అంతా భావిస్తారు. కాకపోతే నేను అలా అనుకోలేదు. ఈ క్రమంలోనే బాహుబలిలో అలాంటి పాత్ర పోషించా. ఎన్నో ప్రశంసలు అందుకున్నా. అందులో నటించిన నటీనటులకు అదో టర్నింగ్ పాయింట్. ఆ తర్వాత కూడా విభిన్నమైన పాత్రలతో మెప్పిస్తున్నా. సికిందర్ సినిమాతో నటిగా కొత్త అద్యాయం ప్రారంభించా.
గతంలో చేయని ఓ కొత్త పాత్ర ఇందులో చేసాను` అని అంది. యాక్షన్ థ్రిల్లర్ గా `సికిందర్ కా ముఖద్దర్` తెరకెక్కింది. ఇందులో తమన్నా వజ్రాలు దొంగతనం పాత్ర పోషించింది. నీరజ్ పాండే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం తమన్నా తెలుగులో ఓదెల-2లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇది లేడీ ఓరియేంటెడ్ చిత్రం. షూటింగ్ దశలో ఉన్న సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.