కమెడియన్ అలీ నిర్మాతగా మారి నిర్మిస్తున్న మూవీ 'అందరూ బాగుండాలి అందులో నేనుండాలి'. ఈ సినిమాకు శ్రీపురం కిరణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళంలో సూపర్ హిట్ ను దక్కించుకుని విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న 'వికృతి' సినిమాకు ఇది రీమేక్. ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంది. ప్రస్తుతం ఈ సినిమాను హైదరాబాద్ మెట్రోలో చిత్రీకరిస్తున్నారు. కథానుసారం కీలక సన్నివేశాలను మెట్రోలో షూట్ చేయాల్సి ఉంది. కాని కరోనా కారణంగా మెట్రో లో షూటింగ్ కు ప్రభుత్వం గత కొన్నాళ్లుగా అనుమతులు ఇవ్వడం లేదు. ఆమద్య రెండు మూడు సినిమాల వాళ్లు ప్రభుత్వంకు మెట్రో వారికి విజ్ఞప్తి చేసినా తోసి పుచ్చారట. కాని అలీకి మాత్రం అనమతులు లభించాయి.
ప్రస్తుతం అలీ రాజకీయాల్లో ఉన్నాడనే విషయం తెల్సిందే. ఆయన తన రాజకీయ పలుకుబడి ఉపయోగించి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో మాట్లాడి అనుమతులు తెచ్చుకున్నాడనే టాక్ ఇండస్ట్రీ వర్గాల నుండి వినిపిస్తుంది. కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన అలీ ఇప్పుడు నిర్మాతగా మారుతున్న నేపథ్యంలో ఆయనకు లక్ ఎలా ఉంటుందని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే నిర్మాతలుగా మారిన కొందరు కమెడియన్స్ నష్టాలపాలయ్యారు. మరి అలీ అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే షూటింగ్ ను పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో కీలక పాత్రను సీనియర్ నరేష్ పోషిస్తున్నారు.