స్విమ్మింగ్ పూల్ లో సెక్సీ వర్కవుట్

Update: 2016-10-17 05:03 GMT
బాలీవుడ్ లో టాప్ బ్యూటీ కత్రినా కైఫ్.. అప్ కమింగ్ స్టార్స్ లో జోరు చూపిస్తున్న హెవీ డ్యూటీ గాళ్ ఆలియా భట్. వీళ్లిద్దరికీ ప్రస్తుతం పని చేయడం లేదు కానీ.. ఓ విషయంలో కలిసి తెగ కలిసి మెలిసిపోయారు. అదే ఫిట్నెస్ మెయింటెనెన్స్ లో భాగంగా చేసే వాటర్ వర్కవుట్స్.

ఆక్వా వర్కవుట్స్ లో భాగంగా ఇద్దరూ స్విమ్మింగ్ పూల్ ఒడ్డున నుంచుని లో పుషప్స్ చేసేస్తున్నారు. స్విమ్ వేర్ లో ఇద్దరు అందగత్తెలను పక్కపక్కనే చూడాలంటే.. ఎటు చూడాలో తెలీక బ్యూటీ లవర్స్ కి మైండ్ పోతోంది. ఇద్దరూ ఎవరి యాంగిల్ లో వారు మైండ్ బ్లోయింగ్ గా ఉండడం.. బికినీ సోకులను ఉమ్మడిగా ప్రదర్శించడం.. పైగా వాటర్ లో వర్కవుట్స్.. విజువల్ అదిరిపోయింది. అయితే.. వీళ్లిద్దరూ అసలు కలిసే ఛాన్స్ ఎక్కడొచ్చిందబ్బా అనే డౌట్ రావడంలో మాత్రం ఏమాత్రం తప్పు లేదు.

కరణ్ జోహార్ తీస్తున్న ఏ దిల్ హై ముష్కిల్ లో ఆలియా భట్ ఓ కేమియో చేస్తోంది. డీజే పాత్రలో కాసేపు మెరవనుంది. మరోవైపు కరణ్ జోహార్ ప్రొడక్షన్ లో వచ్చిన బార్  బార్ దేఖో మూవీలో కత్రినా కైఫ్ హీరోయిన్. ఈ రెండు సినిమాలు ఒకే ప్లేస్ లో షూటింగ్ చేయాల్సి వచ్చినప్పటి విజువల్... ఇప్పుడిలా బయటకు రావడంతో.. సోకుల ప్రేమికులకి పెద్ద పండగ వచ్చేసినట్లయింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News