అంబానీల పెళ్లి వేడుకలో బాలీవుడ్ తారా తోరణం మెరుపులు మెరిపించిన సంగతి తెలిసిందే. నిన్నటి సాయంత్రం అంబానీల అంటిల్లా సహా జియో వలర్డ్ సెంటర్ ధేధీప్యమానమైన కాంతులతో తళుకులీనాయి. జియో వరల్డ్ సెంటర్ లో జరిగిన ఆకాష్ అంబానీ- శ్లోకా మెహతాల పెళ్లి వేడుకలో షారూక్, అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ సహా పలువురు దిగ్గజాలు సందడి చేశారు. వీళ్లతో పాటే పలువురు అగ్ర కథానాయికలు తళుకుబెళుకులు ప్రదర్శించారు. మెజారిటీ బాలీవుడ్ సెలబ్రిటీలు కుటుంబ సమేతంగా ఈ ఈవెంట్ కి అటెండ్ అయ్యారు.
వీళ్లందరిలో నవతరం కథానాయిక ఆలియా భట్ ప్రత్యేకమైన వస్త్రధారణతో తళుక్కుమంది. పింక్ వనంలో పసుపు బొమ్మలా తళతళలాడిపోయింది. పసుపు రంగు లెహంగా డ్రెస్ లో ఆలియా అందం పదింతలు వెలుగులు పరిచింది. పింక్ ఫ్లోరల్ బ్యాక్ డ్రాప్ లో అద్భుతమైన సెట్ ని ఆ వేదిక వద్ద డిజైన్ చేశారు. శ్రీకృష్ణుడు.. ఏనుగు వంటి డిజైన్లను.. అలాగే అతిధులను అలరించేందుకు పురి విప్పే నెమలి విన్యాసాల్ని ఈ వేదిక వద్ద ఏర్పాటు చేశారు. ఎన్ని ఆకర్షణలు ఉన్నా అవన్నీ ఆలియా ముందు చిన్నబోయాయంటే అతిశయోక్తి కాదు. ఆ వేదిక ఆద్యంతం ఆలియా చుట్టూనే అతిధుల కళ్లు తిప్పేసుకునేంతగా మెరిసిపోయింది. ఈ డిజైన్ సవ్యసాచి డిజైన్ .. ప్రత్యేకించి ఆలియా బాడీ లాంగ్వేజ్ ని దృష్టిలో పెట్టుకుని రూపొందించారట.
ఆలియాతో పాటు ఇదే వేదికపై దర్శకనిర్మాత కరణ్ జోహార్ పసుపు వర్ణం డిజైనర్ డ్రెస్ లో మెరుపులు మెరిపించాడు. దిశా పటానీ- జాకీష్రాఫ్ జంట, అభిషేక్ - ఐశ్వర్యారాయ్ జంట, ప్రియాంక చోప్రా తదితరులు ఈ ఈవెంట్ లో తళుక్కున మెరిసారు. ముంబైలోని ఖరీదైన కుర్లా కాంప్లెక్స్ ఏరియాలో జియో వరల్డ్ సెంట్ ఎంతో ఫేమస్. ముంబై నగరం సహా దేశం యావత్తూ ఈ వివాహ మహోత్సవం గురించి ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు.