ఆలియా డిస్ట్రబ్డ్ గా ఉందా? వ‌్యక్తిగత జీవితంలో కల్లోలం కెరీర్ పరంగా డిస్ట్రబ్ చేస్తోందా? అంటే అవుననే తాజా సన్నివేశం చెబుతోంది. అందుకే అందాల అలియాభట్ ఇప్పుడు అన్నిరకాలుగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతోంది. ఓ వైపు ప్రియుడితో బ్రేకప్ వ్యవహారం.. మరోవైపు `ఆర్.ఆర్.ఆర్` నుంచి తప్పుకుందన్న వార్తలు వేడెక్కిస్తున్నాయి. తన ప్రియుడు రణ్ బీర్ కపూర్ కి బ్రేకప్ చెప్పిందని ఇటీవల సోషల్ మీడియా వేడెక్కిస్తోంది. ఇటీవల జరిగిన తన బర్త్ డే వేడుకలో ఆయన పాల్గొనకపోవడం.. కనీసం సోషల్ మీడియా ద్వారా కూడా విషెస్ తెలపకపోవడంతో ఇద్దరి మధ్య మనస్పర్థాలు వచ్చాయని.. అందుకే విడిపోయారని అంతా అనుకున్నారు.
తాజాగా దీనిపై అలియా స్పందించింది. ఆ ప్రచారంలో అసలేమీ నిజం లేదు.. ఇలా లేనిపోని పుకార్లు పుట్టించకండి అని మండి పడుతుందేమో అనుకున్నారంతా. కానీ ఈ రాజీ భామ తనదైన స్టయిల్ లో చాలా తెలివిగా అన్సర్ ఇచ్చింది. తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫోటోని పంచుకుంటూ `ఇంట్లో ఉన్నాను. సంధ్యా సమయాన్నివీక్షిస్తున్నా. ఈ ఫోటో క్రెడిట్ నా ఆల్ టైమ్ అభిమాన ఫోటోగ్రాఫర్ ఆర్కేదే`` అని పేర్కొంది. ఆర్కే అంటే రణ్ బీర్ కపూర్ అని వేరే చెప్పక్కర్లేదన్నమాట. అలా చాలా కూల్ గా సమాధానమిచ్చి.. బ్రేకప్‌పై వస్తోన్న వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టేసిందన్నమాట.
అలియా- రణ్‌బీర్ బ్రహ్మాస్త్ర సెట్స్ లో కలిసారు. అనంతరం ప్రేమ దోమ కుట్టింది. అటుపై జంట షికార్లు గాసిప్పులు వేడెక్కించాయి. ఏ ఫంక్షన్ కి వెళ్ళినా ఇద్దరు కలిసే వెళ్తున్నారు. ఇరు కుటుంబ సభ్యుల ఇంటికి కూడా ఇద్దరు కలిసే వెళుతున్న విషయం తెలిసిందే. దీంతో వీరిద్దరు ఘాడమైన ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. కానీ దీనిపై ఎవరూ స్పందించలేదు. తమ మధ్య ప్రేమ లేదని ఎవరూ చెప్పలేదు. దీంతో ప్రేమించుకుంటున్నట్టు చెప్పకనే చెప్పారంటూ ప్రచారమైంది.
ప్రస్తుతం ఈ జోడి తొలిసారి `బ్రహ్మాస్త్ర`లో కలిసి నటిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సూపర్ హీరో చిత్రంలో అమితాబ్ బచ్చన్- నాగార్జున కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరితోపాటు షారూఖ్ ఖాన్ గెస్ట్ గా కనిపించనున్నారు. ఇదిలా ఉంటే అలియా తెలుగులో ఎంట్రీ ఇస్తూ `ఆర్.ఆర్.ఆర్`లో నటిస్తున్న విషయం విదితమే. కరోనా వల్ల షూటింగ్ ఆగిపోవడంతో ఈ సినిమాకి కేటాయించిన డేట్స్ వేస్ట్ అవుతున్నాయట. నెక్ట్స్ ఆలియా `బ్రహ్మాస్త్ర` షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. దీంతో `ఆర్ ఆర్ ఆర్` నుంచి తప్పుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇందులో వాస్తవమెంతా అనేది ఆలియా స్పందిస్తేనే తెలుస్తుంది. మరోవైపు అలియా `సఢక్ 2`.. `గంగూబాయి కథియవాడి` చిత్రాల్లో నటిస్తోంది.