#RRR సీత‌మ్మలా కాదు సివంగిలా దిగింది!

Update: 2020-12-07 04:30 GMT
ఎట్ట‌కేల‌కు హైద‌రాబాద్ లో ఆలియా దిగిందిలా. శంషాబాద్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో ఖ‌రీదైన హ్యాండ్ బ్యాగ్ చేత‌ప‌ట్టుకుని వ‌స్తుంటే.. ఆ వెన‌క‌గా ట్రాలీ మోస్తున్న అసిస్టెంట్ తో క‌నిపించి అభిమానుల‌కు స్పెష‌ల్ ట్రీటిచ్చింది. విమానాశ్ర‌యంలో ఇలా దిగిందో లేదో అలా అభిమానులు త‌న‌నే చూస్తూ స్ట‌న్న‌యిపోయారు.

ఆలియా స్టైల్ ఆ రేంజులో ఉంది మ‌రి. కుర్ర‌బ్యూటీ లుక్ ప‌ర్ఫెక్ట్ ఫ్యాష‌నిస్టాని త‌ల‌పిస్తోంది. ఒక ర‌కంగా ప్యారిస్ నుంచి దిగిన హంస‌రాణినే త‌ల‌పించింది ఈ కుర్ర‌బ్యూటీ. హైదరాబాద్ విమానాశ్రయంలో నియాన్ గ్రీన్ డెనిమ్ జాకెట్ తో అల్ట్రా స్టైలిష్ లుక్ లో మెరుపులు మెరిపించింది. ఆ క‌ళ్ల‌కు కూల్ గ్లాసెస్ సంథింగ్ స్పెష‌ల్ లుక్ ని ఇచ్చాయి.

అలియా తన వేషధారణతోనే తాను ఎంత పోష్ అన్న‌ది చూపించేసింది.  చురుకైన సూపర్ స్టైలిష్ రూపంతో కనిపించింది. ఆలియా హైదరాబాద్ రాక కోసం చిత్ర‌బృందం స‌హా అభిమానులు చాలా కాలం నుండి ఎదురుచూస్తున్నారు. మహమ్మారి కారణంగా అది కాస్తా ఆల‌స్య‌మైంది.

ఇప్ప‌టికే చ‌ర‌ణ్ తో ఆలియా స‌న్నివేశాల్ని రాజ‌మౌళి పూర్తి చేసారు. కానీ ఇంకా కొన్ని కీల‌క స‌న్నివేశాలు పెండింగులో ఉన్నాయి. ఆ క్ర‌మంలోనే వాటిని పూర్తి చేసేందుకు సిద్ధ‌మై ఆలియా ఇలా దిగారు. రామ్ చ‌ర‌ణ్ - ఎన్టీఆర్ లతో కొన్ని కాంబినేష‌న్ సన్నివేశాల్లో ఆలియా క‌నిపించ‌నుంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం యాక్ష‌న్ దృశ్యాల్ని హైద‌రాబాద్ లో తెర‌కెక్కిస్తున్నారు. వీటిలో ఆలియా కూడా క‌నిపించే వీలుందిట‌.
Tags:    

Similar News