బాలీవుడ్ ఫిల్మ్ ఫేర్ అవార్డు వేడుక ఇటీవలే జరిగింది. ఈ వేడుకలో గల్లీ బాయ్ చిత్రానికి ఏకంగా 13 అవార్డులు రావడంతో జ్యూరీపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు బాహాటంగా విమర్శలు గుప్పిస్తుంటే మరికొందరు గుసగులాడుకుంటున్నారు. అయితే కంగనా సిస్టర్ రంగోలీ మాత్రం ఫిల్మ్ ఫేర్ జ్యూరీ సభ్యుడు అయిన కరణ్ జోహార్ పై దుమ్మెత్తి పోస్తోంది. ఈ అవార్డులు నిజాయితీగా ఇవ్వలేదంటూ విమర్శలు గుప్పించింది. ఇక ఆలియా భట్ పై వరుస ట్వీట్స్ తో విమర్శల వర్షం కురిపించింది.
వరుసగా రెండు సంవత్సరాలు ఉత్తమ హీరోయిన్ గా ఆలియా అవార్డును అందుకోవడం పట్ల రంగోలీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతకు ముందు ఏడాది రాజీ చిత్రంలో ముస్లీం యువతిగా బుర్ఖా వేసుకుని నటించి అవార్డు దక్కించుకున్న ఆలియా మళ్లీ గల్లీ బాయ్ లో కూడా ముస్లీం అమ్మాయిగా నటించి బుర్ఖా వేసుకుని అవార్డు దక్కించుకుందంటూ విమర్శలు గుప్పించింది.
ఆలియా తల్లి దండ్రులు తమ కూతురుకు నటనలో శిక్షణ ఇప్పించకున్నా జీహాదీలో మాత్రం మంచి ట్రైనింగ్ ఇప్పించినట్లుగా ఎద్దేవ చేసింది. మొత్తానికి ఆలియాకు అవార్డు వచ్చిన సంతోషం కూడా లేకుండా చేసింది.
ప్రస్తుతం ఆలియా భట్ మన తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ కు జోడీగా అల్లూరి సీతారామరాజు మరదలు సీత పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే.