ఆర్ ఆర్ ఆర్‌ లో ఆమె ఉంది.. ఇదిగో రుజువు

Update: 2020-03-24 18:30 GMT
అంద‌రూ క‌రోనా వైర‌స్  చ‌ర్చ‌ల్లో మునిగి ఉండ‌గా.. అదిరిపోయే సమాచారం ఇచ్చింది.. అభిమానులు ఎంత‌గానో ఎదురు చూస్తున్న టైటిల్ గురించి ఉన్న‌ట్లుండి అప్ డేట్ ఇచ్చింది. ఉగాది కానుక‌గా బుధ‌వారం టైటిల్ లోగో.. మోష‌న్ పోస్ట‌ర్‌ ను ఆర్ ఆర్ ఆర్ టీం లాంచ్ చేయ‌బోతోంది. ఈ స‌మాచారం కాసేప‌ట్లోనే సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ట్విట్ట‌ర్లో టాప్ లిస్టులోకి ఆర్ ఆర్ ఆర్ హ్యాష్ ట్యాగ్స్ వెళ్లిపోయాయి. ఈ అప్‌డేట్ ఇవ్వ‌డంతో పాటు సినిమాకు సంబంధించి మ‌రో ముఖ్య‌మైన విష‌యంలోనూ స్ప‌ష్ట‌త ఇచ్చేసింది నిర్మాణ సంస్థ డీవీవీ ఎంట‌ర్ టైన్ మెంట్స్. ఆర్ ఆర్ ఆర్ ఫ‌స్ట్ లుక్ గురించి ఆలియా భ‌ట్ చేసిన ట్వీట్‌ ను డీవీవీ ట్విట్ట‌ర్ పేజీలో రీట్వీట్ చేశారు. దీంతో ఈ సినిమాలో ఆలియా భ‌ట్ భాగ‌మే అని రూఢి అయింది. ఆమె సినిమా నుంచి త‌ప్పుకోలేద‌ని స్ప‌ష్ట‌మైంది.

పోయినేడాది ఇదే స‌మ‌యంలో పెట్టిన ప్రెస్ మీట్ లో సినిమాలో ఆలియా భ‌ట్‌ తో పాటు ఓ బ్రిటిష్ అమ్మాయి క‌థానాయిక‌లుగా న‌టిస్త‌న్న‌ట్లు రాజ‌మౌళి ప్ర‌క‌టించాడు.. ఆ తర్వాత ఆ బ్రిటిష్ నటి తప్పుకోవడంతో తకరారు మొదలైంది. కొన్ని నెలల అన్వేషణ తర్వాత ఒలీవియా మోరిస్‌ ను రెండో హీరోయిన్‌ గా ఖరారు చేశారు. కానీ క‌రోనా వైర‌స్ కార‌ణంగా త‌న డేట్లు వృథా అవుతుండ‌టం - తాను చేస్తున్న బ్ర‌హ్మాస్త్ర సినిమాకు ఇబ్బంది త‌లెత్త‌డంతో ఆలియా భట్ ఆర్ ఆర్ ఆర్ నుంచి త‌ప్పుకుంద‌ని కొన్ని రోజులుగా గ‌ట్టిగా ప్రచారం జ‌రుగుతోంది. దీనిపై ఇటు చిత్ర బృందం కానీ.. అటు ఆలియా కానీ స్పందించ‌క‌పోవ‌డంతో సందేహాలు మ‌రింత పెరిగాయి. ఐతే ఆలియా ఆర్ ఆర్ ఆర్ ఫ‌స్ట్ లుక్ గురించి ట్వీట్ చేయ‌డంతో ఈ సినిమాలో ఆమె కొన‌సాగనుంద‌ని స్ప‌ష్ట‌మైంది. కాబ‌ట్టి ఆలియా విష‌యంలో ఇక అన్ని ప్ర‌చారాల‌కు తెర‌దించేయొచ్చు. 


Tags:    

Similar News