షాహిద్‌.. మీ ఆవిడకు కోపం వస్తుందేమో?

Update: 2015-08-13 05:05 GMT
చాక్లెట్‌ బోయ్‌, లవర్‌ బోయ్‌ షాహిద్‌ కపూర్‌ ఇటీవలే ఓ ఇంటివాడయ్యాడు. ఢిల్లీ అమ్మాయి మీరా రాజ్‌ పుత్‌ ని సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నాడు. షాహిద్‌ రాధాస్వామి భక్తుడు కాబట్టి స్వామివారి భక్తుల సాన్నిధ్యంలో చాలా నిరాడంబరంగా ఈ వివాహం జరిగింది. అప్పట్లో ఇదో ఇంట్రెస్టింగ్‌ టాపిక్‌. పెళ్లి, శోభనం హడావుడి అంతా ముగిసింది. ఇక రెగ్యులర్‌ వ్యాపకాల్లోకి వచ్చేశాడు గురుడు.

ఇటీవలే అతడు నటిస్తున్న షాన్‌ దార్‌ చిత్రం ప్రమోషన్‌ లో పాల్గొన్నాడు. ముంబైలో ట్రైలర్‌ ని లాంచ్‌ చేశారు. అయితే ఈ వేడుకలో జనాలంతా ఆశ్చర్యపోయే సర్‌ ప్రైజ్‌ ట్రీట్‌ ఇచ్చింది షాహిద్‌ హీరోయిన్‌ ఆలియాభట్‌. ఈ అమ్మడు ఎప్పటిలానే తనదైన శైలిలో అల్లరల్లరి చేసేస్తూ షాహిద్‌ కి ఓ ఘాటైన ఛుమ్మా ఇచ్చింది. స్పాట్‌ లో ఉన్నవాళ్లకి మైండ్‌ బ్లోవింగ్‌ ట్విస్ట్‌ ఇది. ఈ విషయంపై జనాల్లో ఎంతో ఆసక్తికరమైన చర్చ సాగింది.

మొన్నే కదా పెళ్లయ్యింది. వాళ్లవిడ ఏమైనా అనుకుంటుందేమో అన్న భయం కూడా లేదు! అంటూ ఆలియాపై సెటైర్లు వేశారంతా. అసలు షాహిద్‌ బుగ్గలపై పరాయి అమ్మాయి అలా చుంబించేస్తుంటే అతడి భార్యకు కోపం రాదూ? అంటూ డిష్కసన్‌ పెట్టారంతా. ఆలియా ఇంకా టీనేజరే కదా! అందుకే ఈ దూకుడు అన్నమాట!
Tags:    

Similar News