RRR చిత్రీకరణ కోసం తెలుగు నేర్చుకున్న ఆలియా ఆ తరవాత రామారావు - రాజమౌళి- రామ్ చరణ్ లతో కలిసి పని చేయడాన్ని ఎంతగానో ఆస్వాధించింది. తన పాత్ర చిన్నదే అయినా ప్రభావవంతమైనది అని కూడా తెలిపింది. దానికి తగ్గట్టే థియేటర్లలో సీత పాత్రకు ప్రశంసలు దక్కాయి. కానీ చాలా చిన్న పాత్ర అని టాక్ వినిపించింది. ఇక ఆలియా భట్ తన కెరీర్ బెస్ట్ సినిమాలో నటించింది ఇప్పటికి. అది కూడా సౌత్ సినిమాతో సాధ్యమైంది. ఇక తదుపరి టాలీవుడ్ లో నటించేందుకు ఆలియాకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఎన్టీఆర్ సరసన కొరటాల దర్శకత్వంలో నటిస్తుందని కూడా ప్రచారమైంది. ఆలియా కోసం అల్లు అర్జున్ .. రామ్ చరణ్ .. ప్రభాస్ లాంటి స్టార్లు మునుముందు కూడా వేచి చూస్తారన్న టాక్ ఉంది.
అయితే అంతటి ప్రాధాన్యత ఉన్నా కానీ నిన్న పెళ్లికి RRR స్టార్లను ఆహ్వానించకపోవడం చర్చనీయాంశమైంది. నిజానికి ఆలియా నే ట్రిపుల్ ఆర్ స్టార్లను పిలవలేదా? లేక వీళ్లే వెళ్లలేదా? అన్నదానిపైనా సరైన స్పష్ఠత లేదు. అయితే దీనిపై ఆరా తీస్తే పలు ఆసక్తికర విషయాలు తెలిసాయి.
స్టార్ కపుల్ ఆలియా భట్ - రణబీర్ కపూర్ ఏప్రిల్ 14న కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల RRR టీమ్ పెళ్లికి హాజరు కాలేదు. పెళ్లికి హాజరు కాలేకపోవడమే కాదు.. కనీసం సోషల్ మీడియాలో ఆలియాకు శుభాకాంక్షలు అయినా చెప్పకపోవడం గుసగుసకు తావిచ్చింది.
అయితే కారణం ఎలా ఉన్నా కానీ యాధృచ్ఛికంగా అయినా కానీ అలియా ఇటీవల తన ఇన్ స్టా నుంచి అన్ని RRR-సంబంధిత పోస్ట్ లను తొలగించడం అభిమానుల్లో చర్చనీయాంశమైంది. తనకు జక్కన్న ఆశించినంత పెద్ద ఆఫర్ ఇవ్వలేదని ఆలియా భావించిందా లేక ఇంకేదైనా కారణమా? అన్నది తెలియరాలేదు.
ట్రిపుల్ ఆర్ బృందంతో ఆలియాకు సరిగా కుదరలేదని విభేధాలున్నాయని కూడా ఇంతకుముందు గుసగుసలు వినిపించాయి. కానీ దానికి ఆలియా ఇప్పటికే ఆన్సర్ కూడా ఇచ్చింది. తనకు టీమ్ కు మధ్య అంతా బాగానే ఉందని ఇప్పుడు RRR టీమ్ నే తనను పట్టించుకోలేదని అలియా పేర్కొంది. ఇక జూనియర్ నటిస్తన్న ఎన్టీఆర్ 30 నుండి అలియా తప్పుకున్నట్లు పుకార్లు వైరల్ అయ్యాయి. దానికి తగ్గట్టే RRR బృందం అలియా-రణబీర్ వివాహానికి హాజరు కాలేదు. పెళ్లి సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు కూడా చెప్పలేదు. దీంతో ఇది అభిమానుల్లో డిబేట్ కి కారణమైంది. అయితే అన్ని ఊహాగానాలకు చెక్ పెట్టేందుకు ఆలియా కానీ ఆర్.ఆర్.ఆర్ టీమ్ కానీ ముందుకు రావాల్సి ఉంటుంది.
అలియా భట్-రణబీర్ కపూర్ పెళ్లి లో అతిథులు సందడి తెలిసిందే. కేవలం ఇరు కుటుంబ సభ్యులు కొద్ది మంది అతిథులే కనిపించారు. ఈ పెళ్లిలో ఆర్.ఆర్.ఆర్ స్టార్ల హంగామా ఉంటుందని ఆశిస్తే మాత్రం నిరాశే ఎదురైంది. ఈ ఈవెంట్ ను కవర్ చేయడానికి మీడియా నానా విధాలుగా తంటాలు పడగా..గాయకుడు ప్రతీక్ కుహాద్ వేదిక వద్ద కనిపించాడు .. అతను ఈ సందర్భంగా కొన్ని పాటలు కూడా పాడాడు. సూరత్ కు చెందిన ఓ ఆభరణాల వ్యాపారి రణబీర్- అలియాలకు భారీ బంగారు పూతతో కూడిన బొకేను బహుమతిగా ఇచ్చాడు. నిజానికి ఈ పెళ్లిలో బాలీవుడ్ ఖాన్ ల సందడి లేదు. కనీసం దీపిక పదుకొనే లాంటి స్నేహితురాలు కూడా కనిపించలేదు.