బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ కెరీర్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అమ్మడు పట్టిందల్లా బంగారమే అవుతుంది. 'గంగుబాయి కతియావాడి' తో బాక్సాఫీస్ వద్ద సోలోగానే సత్తా చాటి మార్కెట్ ని రెట్టింపు చేసుకుంది. ఇక 'ఆర్ ఆర్ ఆర్' తో సీతమ్మగా తెలుగు ప్రేక్షకులకు చేరువై పాన్ ఇండియాలోనే ఫేమస్ అయింది. ఇటీవలే మాతృమూర్తిగానూ అవతరించి తల్లి ప్రేమను ఆస్వాదిస్తుంది.
ఆరకంగా అలియా కి 2022 బాగా కలిసొచ్చింది. ప్రస్తుతం వృత్తి..వ్యక్తిగత కెరీర్ లో ఎంతో సంతోషంగా కనిపిస్తుంది. ఇక అలియా భట్ గురించి తెలియని మరో విషయం ఏంటంటే? ఈమె కూడా పుస్తకాల పురుగేనట. చదవడం అంటే ఎంతో ఆసక్తిగా ఉంటుందని తెలిపింది. తనలో ఆ రకమైన అభిరుచి మేరకు తన భావాల్ని ప్రతిబింబిచేలా తొమ్మిది పుస్తకాల్ని సిద్దాం చేస్తానంటోంది.
గతేడాది కుమార్తె రుహా జన్మించిన సంగతి తెలిసిందే. ప్రసూతి సమయంలో సినిమాలకు దూరంగా ఉంది. ప్రతీ తల్లి మాదిరిగానే ఆమె కూడా తన పాప దుస్తులు.. ఇతర వస్తువుల కోసం ప్రత్యేక అల్మరాలను ఏర్పాటు చేయడానికి ఎంతో ఇష్టపడుతుంది. రాహాకి కూడా కథలపై ఆసక్తి కలిగేలా 'బ్రాడ్ ఏ మమ్మా' అనే కథల పుస్తకాలు ప్రారంభించేలా చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
రాహా పసిపాపే అయినా నేను చదవిదే శ్రద్దగా వింటోంది. పాప సహా అందరి కోసం త్వరలో కథల పుస్తకాలు ప్రారంభించాలనుకుంటున్నా. కానీ నాకు భాష సరిగ్గా రాదు కాబట్టి అవి రాస్తోనే లేదో తెలియదు. అందుకే నా సోదరి షాహిన్ భట్ సహకారంతో వాటిని పూర్తి చేస్తా.
ఆనందం..దయ..శక్తి లాంటి భావోద్వేగాలతో కూడిన తొమ్మిది పుస్తకాల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తా' అని తెలిపింది. ప్రస్తుతం అలియాభట్ 'రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ'లో నటిస్తోంది.
అలాగే హాలీవుడ్ లో 'హార్ట్ ఆఫ్ స్టోన్' లోనూ నటిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.