రామ్ గోపాల్ వర్మకు ఇకపై గడ్డు కాలం తప్పదా? అంటే జరుగుతున్న పరిణామాలు అందుకు అద్దంపడుతున్నాయి. దిశ ఉదంతాన్ని తీసుకుని `దిశ ఎన్‌కౌంటర్` పేరుతో గంటన్నర సినిమాగా రిలీజ్ చేయాలని వర్మ ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై దిశ తండ్రి హైకోర్టుని ఆశ్రయించారు. అయితే మాకు ఎలాంటి అభ్యర్ధన రాలేదని కేంద్ర ప్రభుత్వం తరుపు సొలిసిటర్ జనరల్ వెల్లడించారు.
దీనిపై వర్మ స్పందించలేదు. నట్టికుమార్ ఈ వివాదంపై స్పందించారు. అయితే ఈ విషయాన్ని మాత్రం ఆల్ ఇండియా రెడ్డి జాయింట్ యాక్షన్ కమిటీ (జాక్) చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ చిత్రాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ రిలీజ్ చేయకూడదని వర్మకు వార్నింగ్ ఇస్తున్నారు. దిశ ఫ్యామిలీ అనుమతి తీసుకోకుండా వర్మ సినిమా చేయడంపై రెడ్డి సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అంతే కాకుండా సెన్సార్ బోర్డ్ ని ఈ చిత్రానికి అనుమతి నిరకరించాలని వినతి పత్రాన్ని కూడా సమర్పించినట్టు తెలిసింది.
ఇంత చేసినా `దిశ ఎన్ కౌంటర్` నిర్మాణం.. రిలీజ్ ఆపకుంటే వర్మపై బౌతిక దాడులకు దిగాలని ఎంత వరకైనా వెళ్లాలని రెడ్డి సంఘాలు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. గతంలో కమ్మ సామాజిక వర్గాన్ని.., కాపు సమాజిక వర్గాన్ని టార్గెట్ చేసిన వర్మ తాజాగా `దిశ ఎన్ కౌంటర్`తో రెడ్డి సంఘంతో గొడవకు దిగడం సంచలనంగా మారింది. అయితే కొంత మంది మాత్రం ఇది నిజంగానే రెడ్డి సంఘాలు వర్మపై భౌతిక దాడులకు దిగబోతున్నారా? లేక వర్మ పబ్లిసిటీ స్టంట్‌లో భాగంగా ఇదంతా ప్రచారం చేస్తున్నారా అన్నది తెలియాలంటే మూవీ రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.