భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తన కొత్త చిత్రం 'ఇండియన్ 2'(భారతీయుడు 2) ఫస్ట్ లుక్ ఈమధ్యే పొంగల్ ఫెస్టివల్ సందర్భంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ లో సేనాపతి గెటప్ కంటే.. 'ఓల్డర్ వైజర్ డెడ్లియర్' క్యాప్షన్ కంటే అందరినీ ఆకట్టుకున్న అంశం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ పేరు.
'భారతీయుడు' సినిమాకు ఎఆర్ రెహమాన్ అందించిన సంగీతం ఇప్పటికీ కూడా ఫ్రెష్ గా ఉంటుంది. అన్నీ ట్యూన్స్ చార్ట్ బస్టర్లే. అలాంటిది ఎఆర్ రెహమాన్ ను తీసుకోకుండా అనిరుధ్ ను తీసుకోవడం ఒక పెద్ద హాట్ టాపిక్ అయింది. రెహమాన్ ఫామ్ లో లేడని కొందరు అంటే.. మరి కొందరేమో శంకర్ - రెహమాన్ కు '2.0' సినిమా సమయంలో విభేదాలు వచ్చాయని.. అందుకే రెహమాన్ ను తీసుకోలేదన్నారు.
ఈ విషయంపై అటు రెహమాన్..ఇటు శంకర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. కానీ ఇద్దరు తమదైన స్టైల్ లో చెక్ పెట్టారు. '2.0' ఫస్ట్ లుక్ కు రెస్పాన్స్ గా రెహమాన్ "మీకు మీ టీమ్ కు మరో బ్లాక్ బస్టర్ రావాలని కోరుకుంటున్నాను. గుడ్ లక్ బడ్డీ". ఈ ట్వీట్ కు "సో స్వీట్ ఆఫ్ యూ డియర్ రెహమాన్.. థ్యాంక్ యూ వెరీ మచ్" అంటూ రిప్లై ఇచ్చాడు శంకర్. నిజంగా విభేదాలే ఉంటే ఇలా ఎందుకు ఫ్రెండ్స్ లా ట్విట్టర్ లో మెసేజులు పెట్టుకుంటారు? కాబట్టి ఆల్ ఈజ్ వెల్ అన్నట్టే.