బిగ్ బాస్.. దీనికి ఉండే క్రేజ్ అంతా ఇంతాకాదు.. వరుసగా మూడు సీజన్లలో చాలా మంది ముక్కుమొహం తెలియని వారు కూడా సెలెబ్రెటీలుగా మారిపోయారు. బోలెడు పాపులారిటీ సంపాదించారు. ప్రముఖ చానెల్ లో ప్రసారమయ్యే ఈ షో వాస్తవానికి జూన్ లో ప్రారంభం కావాల్సి ఉండేది. కానీ ప్రస్తుత మహమ్మారి-లాక్ డౌన్ కారణంగా బిగ్ బాస్ వాయిదా పడింది. షూటింగ్ లకు అనుమతిస్తే కానీ బిగ్ బాస్ మొదలయ్యే తేదీపై క్లారిటీ రానుంది.
కాగా ఈసారి లేట్ గానైనా లేటెస్ట్ గా బిగ్ బాస్ ను స్ట్రార్ట్ చేసేందుకు చానెల్ రెడీ అవుతోందట.. ఇప్పటికే బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఎంపిక జరిగిందని టాక్ వినిపిస్తోంది. బిగ్ బాస్ సీజన్ 4 పాల్గొనే సభ్యులను ఎంపిక చేయడానికి నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.
ప్రస్తుతం బిగ్ బాస్ టీం ఇప్పటిదాకా పలువురిని సంప్రదించారని వార్తలు వస్తున్నాయి. హీరో తరుణ్ - యాంకర్ శివ - జాహ్నవి - సింగర్ మంగ్లీ - వర్షిణీ - అఖిల్ శ్రతక్ లను సంప్రదించారని తెలిసింది.
ఇక సీజన్ 3ని హోస్ట్ చేసి దుమ్మురేపిన అగ్రహీరో నాగార్జునే ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం ఈ వైరస్ ప్రభావం లేకుంటే ఎప్పుడో ఈ షో ప్రారంభమయ్యేది. కానీ ఇప్పుడు ఎప్పుడు మొదలుపెడుతారన్నది చెప్పలేకుండా ఉంది. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది.