రీ షూట్స్ విషయంలో.. రిలీజ్ డేట్ పై మొదట్లో కొన్ని సందేహాలు నెలకొన్నప్పటికీ అవన్నీ ఇప్పుడు తొలగిపోయి 'ఎన్టీఆర్ మహానాయకుడు' ఫిబ్రవరి 22 న విడుదల చేసేందుకు సన్నాహలు జరుగుతున్నాయి. కానీ డిస్ట్రిబ్యూటర్ల.. బయ్యర్ల విషయం మాత్రం గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చలు జరిగాయట.
మొదట సురేష్ మూవీస్ ద్వారానే ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ చేసేందుకు బాలయ్య అండ్ టీమ్ నిర్ణయించుకున్నప్పటికీ లాస్ట్ మినిట్ లో కృష్ణ.. వైజాగ్ ఏరియాల డిస్ట్రిబ్యూషన్ మాత్రం సాయి కొర్రపాటికి ఇవ్వాలని బాలయ్య డిసైడ్ అయ్యారట. సాయి కొర్రపాటి ఈ సినిమాకు సహనిర్మాత అయి ఉండి కూడా మొదటి భాగం డిస్ట్రిబ్యూషన్ వల్ల నష్టపోయారని బాలయ్య సన్నిహితులు చెప్పడంతోనే ఆయనకు డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేందుకు ఒప్పుకున్నారట.
ఇదిలా ఉంటే ఓవర్సీస్ విషయంలో కూడా చాలా హంగామానే నడిచిందట. మొదటి పార్ట్ పంపిణీ చేసిన యుఎస్ తెలుగు కంపెనీ వారు దాదాపు ఆరు కోట్ల రూపాయలు నష్టపోయారట. కానీ ఎన్ బీ కే ఫిలిమ్స్ యూనిట్ వారు సెకండ్ పార్ట్ కు మూడు కోట్లు డిమాండ్ చేశారట. బేరసారాలు అన్ని పూర్తయ్యాక ఒకటిన్నర కోట్లు ముందు ఇచ్చేలా.. ఒక కోటి రూపాయలకు మాత్రం చెక్ ఇచ్చేలా.. సినిమా హిట్ అయితే చెక్ ను ఎన్ క్యాష్ చేసుకునేలా ఒప్పందం కుదిరిందట. దీంతో డిస్ట్రిబ్యూషన్ పరంగా 'మహానాయకుడు' కు పూర్తిగా లైన్ క్లియర్ అయిందని సమాచారం.