సంక్రాంతి రిలీజ్ లు అన్నింటిని శ్లోకా క‌బ్జా చేసిందిగా!

Update: 2022-11-23 01:30 GMT
సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాల‌న్ని క్యూ లోఉన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే వాల్తేరు వీర‌య్య‌..వీర సింహారెడ్డి స‌హా విజ‌య్ తెలుగు డెబ్యూ వార‌సుడు రిలీజ్ రేసులో ఉన్నాయి. సంక్రాంతి కానుక‌గా భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అవుతున్నాయి. దీంతో అభిమ‌నుల్లో ఎగ్టైట్ మెంట్ పెరిగిపోతుంది. సంక్రాంతి స్టార్  ఎవ‌ర‌వుతారంటూ  బెట్టింగ్ లుసైతం మొద‌లైపోయాయి.

రిలీజ్ తేదీలు అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది.  ఆ తేదీలు  రాగానే వాతావ‌ర‌ణం మ‌రింత వెడెక్కుతుంది. తెలుగు రాష్ర్టాల స‌హా ఓవ‌ర్సీల‌స్ లోనూ ఈ సినిమాల‌న్ని భారీ ఎత్తున రిలీజ్ అవుతున్నాయి. రిలీజ్ రైట్స్ కోసం బ‌డా సంస్థ‌లు కొన్ని నెల‌లుగా క్యూ లో ఉన్నాయి. ఎన్నికోట్లైనా పోసి బాలయ్య‌... చిరంజీవి సినిమా రైట్స్ ద‌క్కించుకోవాల‌ని పోటీ ప‌డుతున్నాయి.

తాజాగా ఓవ‌ర్సీస్   రైట్స్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది.  చిరంజీవి...బాల‌య్య‌..విజయ్ చిత్రాల  అమెరికా రిలీజ్ రైట్స్ ని  శుక్లా ఎంట‌ర్టైన్ మెంట్స్ ద‌క్కించుకున్న‌ట్లు సంద‌రు సంస్థ ప్ర‌క‌టించింది. గ‌తంలో ఇదే సంస్థ బింబిసార‌...స‌ర్కారు వారి పాట లాంటి చిత్రాల్ని అమెరికాలో పంపిణీ చేసింది. ఈ రెండు అక్క‌డా భారీ విజ‌యం సాధించాయి.

దీంతో మ‌రోసారి కోట్ల రూపాయ‌లు వెచ్చించి స్టార్ హీరోల చిత్రాలన్నింటిని ద‌క్కించుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ రేసులో చాలా కంపెనీలు పోటీ ప‌డిన‌ప్ప‌టికీ  అధికంగా వెచ్చించి శుక్లా అగ్ర‌స్థానంలో నిలిచింది.

అలాగే మెగా ప‌వర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ 15వ సినిమా.. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టిస్తోన్న‌'ఖుషీ' సినిమా  ఓవ‌ర్సీస్ రైట్స్ సైతం ఇదే సంస్థ ద‌క్కించుకుంది.

వీటి కోసం భారీగా ఖ‌ర్చు చేసిన‌ట్లు తెలుస్తోంది. స్టార్ హీరోల చిత్రాల రైట్స్  కోసం భారీగా  వెచ్చించి రైట్స్ ద‌క్కించుకోవ‌డానికి చాలా సంస్థ‌లు పోటీలో నిలుస్తుంటాయి.  అక్క‌డ ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త డిస్ర్టిబ్యూష‌న్ కంపెనీలు వెల‌స్తుంటాయి.  అమెరికాలో తెలుగు సినిమాల‌కున్న‌ డిమాండ్  కార‌ణంగానే ఈ పోటీ. అక్క‌డ మార్కెట్ మ‌న  హీరోల‌కు ఎంతో కీల‌కం. తెలుగు రాష్ర్టాల‌తో స‌మానంగా ఓవ‌ర్సీస్ లో స్టార్ హీరోల చిత్రాలు ఆద‌ర‌ణ‌కు నోచుకుంటాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News