ఈ కొత్త సినిమాలన్నీ నెట్ ఫ్లిక్స్ లోనే.. ఈసారికి కొనక తప్పేట్లుగా లేదుగా?
అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీకి తగ్గట్లుగా అప్డేట్ కావాల్సిన అవసరం వచ్చేస్తుంది. సినిమా హాల్లొ కూర్చొని చూసే సినిమాను టీవీలో చూడటం మొదలుకావటం.. ఆ తర్వాత క్యాసెట్లలో.. తర్వాత సీడీల్లో ఆ తర్వాత ల్యాప్ టాప్ లు.. కంప్యూటర్ల చూసే అలవాటుకు కొనసాగింపుగా మొబైల్ ఫోన్ లోనూ సినిమాలు చేసే పరిస్థితి. అప్పట్లో పైరసీ ప్రింట్ కోసం పాకులాడే పరిస్థితి నుంచి.. ఇప్పుడు ఏకంగా ఓటీటీల దెబ్బకు సినిమాల్ని ఒరిజినల్ గా చూసే పరిస్థితి అందరికి అలవాటుగా మారింది.
ఓటీటీ అన్నంతనే గుర్తుకు వచ్చే అమెజాన్.. నెట్ ఫ్లిక్స్.. డిస్నీ హాట్ స్టార్.. జీ.. ఆహాతో పాటు బోలెడన్ని ప్లాట్ ఫాంలు ఉన్నాయి. ఒక్కో ఓటీటీని ఒక్కో ధర చొప్పున ఉండటం.. నచ్చిన వాటికి చందా కట్టేయటం తెలిసిందే. మిగిలిన ఓటీటీలకు కాస్త భిన్నంగా.. లక్షలాది సినిమా బ్యాంకుతో ఉండే నెట్ ఫ్లిక్స్ ఓటీటీ చందాదారులుగా మారటానికి కాస్తంత ఇబ్బంది ఉన్న సంగతి తెలిసిందే. మిగిలిన వాటితో పోలిస్తే ధర ఎక్కువగా ఉండటంతో పాటు.. తెలుగు సినిమాలకు సంబంధించిన మిగిలిన వారితో పోటీగా సినిమాల్నిసొంతం చేసుకోవటంలో వెనుకబడిందన్న మాట వినిపిస్తూ ఉంటుంది.
అందుకు బదులుగా కొత్త ఏడాదిలో పలు క్రేజీ సినిమాలకు ఓటీటీ ఫ్లాట్ ఫాంలో తామే వేదికగా నిలిచేందుకు వీలుగా డీల్స్ కుదుర్చుకుంది నెట్ ఫ్లిక్స్. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంత దూకుడు ప్రదర్శిస్తున్న ఈ ఓటీటీ తీరు చూస్తే.. ఈ ఏడాది దీని సబ్ స్క్రిప్షన్ తీసుకోక తప్పేట్లు లేదన్నట్లుగా మారింది. ఇంతకీ ఈ ఏడాది ఆ ఫ్లాట్ ఫాం మీద విడుదల కానున్న మూవీల లెక్కలోకి వెళితే..
సంక్రాంతి సీజన్ లో విజేతగా నిలిచిన వాల్తేరు వీరయ్య తర్వాతి మూవీ భోళాశంకర్. చిరంజీవికి జతగా తమన్నా.. కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో ఘన విజయం సాధించిన వేదాళంకు ఇది రీమేక్. భారీఅంచనాలు ఉన్న ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో రానుంది. దీన్ని తెలుగుతో పాటు తమిళం.. కన్నడ.. మలయాళ భాషల్లోనూ విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మహేశ్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టు చేస్తున్న క్రేజీ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్ గా చేస్తున్నారు. ఈ మూవీని నెట్ ఫ్లిక్స్ ద్వారా టెలికాస్ట్ కానుంది. సంక్రాంతి ముందుగా విడుదలై విజయం సాధించటమే కాదు.. రవితేజ కెరీర్ లో తొలిసారి వంద కోట్ల రూపాయిల మార్కును దాటిన థమాకా చిత్రం ఓటీటీ నెట్ ఫ్లిక్స్ దే అన్న విషయం తెలిసిందే. ఈ మధ్యన విడుదలైన మరో చిక్కనైన లవ్ స్టోరీ '18 పేజీస్' కూడా నెట్ ఫ్లిక్స్ లోనే ప్రసారం కానుంది.
వీటితో పాటు నాని - కీర్తి సురేశ్ నటిస్తున్న దసరా.. నందమూరి కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్న అమిగోస్.. ప్రముఖ హీరోయిన్ అనుష్క..యువ నటుడు నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీలకు ఓటీటీ ఫ్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ కావటం గమనార్హం. వీటితో పాటు సిద్ధు జొన్నలగడ్డ.. అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న డీజే టిల్లు సీక్వెల్ తో పాటు.. వరుణ్ తేజ్.. సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ - శ్రీలీల నటిస్తున్న చిత్రాలకు ఓటీటీ వేదిక కావటం గమనార్హం.
వీటితో పాటు మీటర్.. కార్తికేయ నటిస్తున్న ప్రొడక్షన్ 8, సందీప్ కిషన్ బడ్డీ.. అనికా సురేంద్రన్ నటించిన మలయాళ చిత్రం కప్పెలా రీమేక్ బుట్టబొమ్మ.. నాగశౌర్య తదుపరి చిత్రాలు నెట్ ఫ్లిక్స్ లోనే విడుదల కానున్నాయి. ఇంత లిస్టు చదివిన తర్వాత.. నెట్ ఫ్లిక్స్ చందా గురించి ఆలోచించాల్సిన టైం వచ్చేసిందని చెప్పక తప్పదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.