బన్నీకి నచ్చే 'చెప్పను బ్రదర్'

Update: 2016-07-14 17:58 GMT
అల్లరి నరేష్ నవ్వుల హంగామా సృష్టించేందుకు సెల్ఫీరాజాగా వచ్చేస్తున్నాడు. మరికొన్ని గంటల్లోనే అల్లరోడి సందడి మొదలైపోతుంది. ఫస్ట్ డే పాజిటివ్ టాక్ తీసుకొచ్చేందుకు అన్ని రకాలుగాను యూనిట్ ప్రయత్నిస్తోంది. పబ్లిసిటీ విషయంలో యాక్టివ్ గా ఉండే అల్లరి నరేష్ కూడా సినిమా సంగతులు అభిమానులతో పంచుకుంటున్నాడు.

సెల్ఫీ రాజా ట్రైలర్ లో కమెడియన్ పృథ్వీతో చెప్పించిన 'చెప్పను బ్రదర్' డైలాగ్ బాగా పేలింది. కానీ ఈ పంచ్ కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఏ టైంలో చెప్పాడో తెలిసిందే. మరి ఈ డైలాగ్ ని సినిమాలో పెట్టడం వివాదం అవుతుందనే టాక్ ఉంది. 'మేము చెప్పను బ్రదర్ ను సరదాగానే ఉపయోగించాం. సినిమా చూస్తే కానీ.. దాని అసలు మీనింగ్ అర్ధం కాదు. ఎంత సున్నితంగా ఈ డైలాగ్ ఉంటుందంటే.. ఒకవేళ బన్నీ ఈ సీన్ ని చూసినా పడీపడీ నవ్వుతాడు' అంటున్నాడు సెల్ఫీ రాజా.

ఈ మూవీలో అన్నిటికంటే పెద్ద హైలైట్ తన కేరక్టర్ చుట్టూ అల్లిన కామెడీ అన్న అల్లరి నరేష్.. సెల్ఫీల పిచ్చితో తనను తాను ప్రమాదాల్లో పడేసుకుని బయటపడే వ్యక్తి కథే ఈ సినిమా అన్నాడు. అయితే.. గతంలో మాదిరిగా ఇప్పుడు వరుసగా సినిమాలు చేయకపోవడానికి కారణం.. తాను ఫ్లాప్స్ ఎదుర్కోవడమే అని ఒప్పుకున్నాడు ఈ కామెడీ హీరో.
Tags:    

Similar News