కరోనా కారణంగా విడుదల తేదీలను వాయిదా వేసుకున్న సినిమాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు థియేటర్లకు వస్తున్నాయి. అలా 'ఎస్.ఆర్. కల్యాణ మండపం' కూడా ఈ నెల 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా సందడిగా జరిగింది. ఈ సినిమా ఫస్టు టికెట్ ను కొనుగోలు చేసిన అల్లరి నరేశ్ మాట్లాడాడు. 'సభకు నమస్కారం' అంటూ ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాను ఆయన అందరికీ గుర్తుచేశాడు.
"సెకండ్ లాక్ డౌన్ తరువాత మళ్లీ ఇంతమందిని ఇక్కడే చూస్తున్నాను. ఇదివరకూ సినిమా తీయడం చాలా ఈజీ .. కానీ రిలీజ్ చేయడం చాలా కష్టం. ఈ రోజున సినిమా తీయడం కష్టం .. దానిని రిలీజ్ చేయడమూ కష్టమే ఎందుకంటే కోవిడ్ వల్లనే. కానీ లాక్ డౌన్ కి .. లాక్ డౌన్ కి మధ్యలోనే టాలీవుడ్ 16 హిట్లను ఇచ్చింది. అందుకు కారణం తెలుగు ప్రజలకు సినిమాల పట్ల గల ఇష్టం .. అంతకు మించిన ఆసక్తి.
సెకండ్ లాక్ డౌన్ తరువాత ధైర్యం చేసి ఈ సినిమాను థియేటర్లకు తీసుకొస్తున్నారు. అందుకు నిర్మాతలకు హ్యాట్సాఫ్. ఈ సమయంలో ఈ స్థాయిలో ప్రమోషన్ చేయడం మామూలు విషయం కాదు. ఈ సినిమా సక్సెస్ కావాలి .. ఇకపై ప్రతి శుక్రవారం వరుస సినిమాలు థియేటర్లకు రావాలి . మళ్లీ పాత రోజులు రావాలి అని కోరుకుంటున్నాను. అన్ని జాగ్రత్తలు పాటిస్తూ థియేటర్స్ కి రండి .. లేదంటే కొన్ని రోజులకు థియేటర్లన్నీ కూడా కల్యాణ మండపాలైపోతాయి. ఈ సినిమా హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని చెప్పుకొచ్చాడు.
ఇక హీరో కార్తికేయ మాట్లాడుతూ ... "సెకండ్ వేవ్ తరువాత విడుదలవుతున్న సినిమాలలో 'ఎస్.ఆర్. కల్యాణ మండపం' ఒకటి. ఈ సినిమా హిట్ కావడం హీరో కిరణ్ కి ఎంత ముఖ్యమో .. మా అందరికీ అంతే ముఖ్యం. ఒక్కో సినిమా ఓటీటీకి వెళ్లిపోతుంటే భయమేస్తోంది. ఎందుకంటే నా లాంటి హీరోలు ఎంతోమంది తమ సినిమాలను థియేటర్లలో చూసుకోవాలనే ఆశతో ఉంటారు. థియేటర్లలో జనం మధ్యలో సినిమాలు చూడటమనేది నాలాంటి హీరోల కల. అలాంటి పరిస్థితుల్లో ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తుండటం నిజంగా విశేషం.
చైతన్ భరద్వాజ్ 'ఆర్ ఎక్స్ 100' సినిమాలో నాకు 'పిల్లా రా' హిట్ ఒకటే ఇచ్చాడు. కానీ కిరణ్ సినిమాకు అన్ని హిట్ సాంగ్స్ ఇచ్చాడు. అందుకు నాకు చాలా జలసీగా ఉంది. నేను .. కిరణ్ ఒకలా ఉంటామని చాలామంది అంటున్నారు. కొన్ని క్లోజ్ షాట్స్ లో నాకూ అనిపించింది. ఆ యాంగిల్లో చూసుకుంటే నా తమ్ముడు అనుకుంటాను. ఈ సినిమాకి కథ .. మాటలు కూడా కిరణ్ రాయడం విశేషం. కిరణ్ ను చూసిన తరువాత ఆయన ఎంత హార్డు వర్క్ చేశాడనేది నాకు అర్థమైంది. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను" అని చెప్పుకొచ్చాడు.