సీమ శాస్త్రి కాంబో రిపీట్!

Update: 2018-11-16 09:42 GMT
అల్లరి నరేష్ మార్కెట్ ఈమధ్య ఎంతగా దెబ్బతిన్నదో అందరికీ తెలిసిందే.  2012 లో విడుదలైన 'సుడిగాడు' అల్లరి హీరో లాస్ట్ హిట్టు.  అప్పటినుండి డజనుకు పైగా సినిమాల్లో నటించినా ఒక్కటీ బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టెక్కలేదు. దీంతో మొదటిసారి ఒక సినిమాలో హీరోగా కాకుండా కీలక పాత్ర పోషించేందుకు ఒప్పుకున్నాడు.  అదే మహేష్ బాబు 'మహర్షి'. అల్లరి నరేష్ గతంలో కూడా ఇతర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నా హీరోగానే నటించాడు కానీ ఒక క్యారెక్టర్ చేయడం మాత్రం మొదటిసారి.

అలా అని ఇకపై అలానే కంటిన్యూ అవుతాడని మీరేమీ ఫిక్స్ కావద్దు. తాజాసమాచారం ప్రకారం జీ. నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమాలో నటించేందుకు నరేష్ గ్రీన్ సింగల్ ఇచ్చాడట.   నరేష్ - నాగేశ్వరరెడ్డి కాంబినేషన్లో గతంలో 'సీమశాస్త్రి'.. 'సీమటపాకాయ్' లాంటి విజయవంతమైన చిత్రాలు తెరకెక్కాయి.  సో.. సీమ ఫ్రాంచైజీ లో మరో కొత్త సినిమా తీసుకొస్తారేమో!

నరేష్ మాత్రమే కాదు జి. నాగేశ్వరరెడ్డి కూడా హిట్టు కోసం పరితపిస్తున్నాడు. 'ఈడో రకం ఆడో రకం'.. 'ఆటాడుకుందాం రా'.. 'ఇంట్లో దెయ్యం నాకేం భయం'..'ఆచారి అమెరికా యాత్ర'  ఇది అయన సినిమాల వరస.  నరేష్-జి.నాగేశ్వరరెడ్డి కాంబో ఇద్దరికీ సక్సెస్ తీసుకొస్తుందేమో వేచి చూడాలి.
    

Tags:    

Similar News