మహేష్ బాబు సినిమాలో అవకాశం అంటే మిగతా నటీనటులు అదృష్టంగానే భావిస్తారు. మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పేస్తారు. హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అల్లరి నరేష్.. ఇప్పుడున్న స్థితిలో మహేష్ బాబుతో కలిసి నటించే అవకాశం అనగానే మరో మాట లేకుండా ఒప్పేసుకోవాలి. ఇదేమీ జస్ట్ రూమర్ కాదని.. తనను మహేష్ సినిమా మేకర్స్ సంప్రదించిన మాట వాస్తవమే అని నరేష్ కూడా అంగీకరించాడు. కానీ ఆ సినిమాకు ఓకే చెప్పలేదని.. అలాంటిదేమైనా ఉంటే తనే వెల్లడిస్తాడని నరేష్ స్పష్టం చేశాడు. మరి మహేష్ సినిమా విషయంలో నరేష్ ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నట్లు.. ఎందుకు వెంటనే ఓకే చెప్పనట్లు అన్న సందేహం రావడం సహజం.
ఐతే పెద్ద హీరోల సినిమాల్లో స్పెషల్ రోల్స్ అని చెప్పి.. చిన్న.. మీడియం రేంజి హీరోలకు షాకులిచ్చిన సందర్భాలు గతంలో టాలీవుడ్లో చాలా ఉన్నాయి. ఇంతకుముందు మహేష్ బాబు సినిమా ‘అర్జున్’లో అప్పట్లో కాస్త ఫాంలో ఉన్న రాజాకు ఓ క్యారెక్టర్ ఇచ్చారు. అతను సంతోషంగా ఆ సినిమా చేశాడు. కానీ తీరా చూస్తే ఆ పాత్రకు అంత ప్రాధాన్యమేమీ లేకపోయింది. రాజాకు దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోయింది. ఈ మధ్య ‘నేను లోకల్’లో నవీన్ చంద్ర పాత్ర గురించి ఆహా ఓహో అన్నారు. తీరా చూస్తే అది కూడా తేలిపోయింది. ‘బాద్ షా’లో తాను చేసిన పాత్ర విషయంలో నవదీప్ తర్వాత ఎంత ఫీలయ్యాడో తెలిసిందే. అదే సినిమాలో సిద్దార్థ్ క్యారెక్టర్ కూడా అలాంటిదే. నరేష్ కూడా తన పాత్ర ఇలా అవుతుందనే ఫీలవుతున్నాడేమో మరి. మహేష్ సినిమా అంటే మరో హీరోకు మరీ పెద్ద రోల్ ఇవ్వలేదు. అలాగని ఆ పాత్రకు అంత ప్రాధాన్యం లేకుండా నరేష్ కు ఎలాంటి ప్రయోజనం ఉండదు. అసలే తన కెరీర్ స్లంప్ లో ఉన్న టైంలో ఓ స్టార్ హీరో సినిమాలో ప్రాధాన్యం తక్కువన్న పాత్ర చేస్తే దెబ్బ తింటానని నరేష్ వెనుకంజ వేస్తున్నాడో ఏమో?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/