అల్లరి నరేష్.. ఒకప్పుడు ఏడాదికి మూడు నాలుగు రిలీజ్ లు ఉండేవి అతడికి. మూణ్నాలుగు సినిమాలు సెట్స్ మీద ఉంటే.. ఇంకో మూణ్నాలుగు చర్చల్లో ఉండేవి. ఒక సినిమా పోయినా.. ఇంకో సినిమా ఆడేసేది. బాగా ఆడని సినిమాలకు కూడా నష్టాలొచ్చేవి కావు. దీంతో దర్శక నిర్మాతలు అతడి వెంట పడేవాళ్లు. కానీ ఇప్పుడు అల్లరోడి పరిస్థితి ఏమీ బాగా లేదు. వరుస ఫ్లాపులతో మార్కెట్ అంతా కొట్టుకుపోయింది. అతడి సినిమాలకు ఈ మధ్య ఓపెనింగ్స్ కూడా పెద్దగా రావట్లేదు. ఇలాంటి స్థితిలో తన ఆశలన్నీ ‘సెల్ఫీ రాజా’ మీదే పెట్టుకున్నాడు. కానీ ఈ సినిమా పోస్టర్లు.. టీజర్ అవీ చూస్తే ఔట్ పుట్ మీద అంత నమ్మకం కలగట్లేదు.
అల్లరోడు ట్రాక్ తప్పడానికి ప్రధాన కారణం.. అతడి సినిమాల్లో కొత్తదనం ఏమాత్రం లేకపోతుండటమే. ఒకప్పుడు అల్లరోడు పేరడీలు చేస్తే బాగుండేది. కానీ ఎప్పుడూ అవే చేస్తుండటంతో మొహం మొత్తేసింది. హిట్ సినిమాల స్పూఫులు.. పేరడీలతో నెట్టుకొచ్చే పరిస్థితి ఇప్పుడు లేదు. ‘సుడిగాడు’ సినిమాతోనే అతను అవన్నీ మానేయాల్సింది. అందులో పేరడీల డోస్ బాగా ఎక్కువైపోయింది. దీంతో ఆ తర్వాత అల్లరోడు అలాంటి వేషాలేస్తుంటే జనాలకు మొనాటనీ వచ్చేసింది. నరేష్ గత కొన్ని సినిమాల వైఫల్యానికి ప్రధాన కారణం అదే. ఇప్పుడతను రొటీన్ వేషాలు వదిలేసి.. మేకోవర్ కోసం ట్రై చేయాలి. కానీ నరేష్ లో అలాంటి మార్పేమీ కనిపించట్లేదు. ‘సెల్ఫీరాజా’ టీజర్ చూస్తే అందులోనూ పేరడీలే కనిపించాయి. ఓ సన్నివేశంలో అర్జున్ సినిమాను గుర్తుకు తెచ్చాడు నరేష్. లేటెస్టుగా రిలీజ్ చేసిన ఓ పోస్టర్ చూస్తే.. అందులో బాహుబలిలో శివుడు కట్టప్ప నెత్తిన కాలు పెట్టినట్లు అల్లరోడు కూడా అదే చేస్తున్నాడు. ఒకప్పుడైతే అల్లరోడు ఇలాంటి వేషాలు వేయడం చూడగానే నవ్వొచ్చేది. ఇప్పుడా ఫీలింగ్ కలగట్లేదు. అల్లరోడికి ఈ పేరడీల హ్యాంగోవర్ ఎప్పుడు వదులుతుందో అనిపిస్తోంది. మరి సినిమాలో ఏం చూపిస్తాడో చూడాలి.