సెల్ఫీ యాంగిల్ న‌చ్చ‌దంట‌

Update: 2016-07-14 17:30 GMT
సెల‌బ్రిటీ క‌నిపిస్తే చాలు మ‌న యూత్ ఓ సెల్ఫీ అంటుంది. అలాంటి సెల్ఫీల వ‌ల్ల ఒక్కోసారి చిరాకు కూడా క‌లుగుతుంది. ఏదైనా సినిమా ఫంక్ష‌న్ అయితే ప‌ర్వాలేదు కానీ.. మ‌నోళ్లు చావు ద‌గ్గ‌ర కూడా సెల్ఫీలు దిగ‌డానికి వెన‌కాడ‌రు. అలాంటి సంద‌ర్భంలో చాలా చిరాకు వేస్తుంది అంటున్నాడు అల్ల‌రి న‌రేష్. తాను న‌టించిన సెల్ఫీరాజా శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొస్తోంది. ఈ సంద‌ర్భంగా  సెల్ఫీ రాజా ముచ్చ‌ట్లు మీడియాతో పంచుకున్నాడు. సెల్ఫీ ట్రెండ్ ఇప్పుడు బాగా న‌డుస్తోంది. ఎక్క‌డికెళ్లినా... ప్ర‌తి ఒక్క‌రూ ఒక్క సెల్ఫీ అంటూ వ‌చ్చేస్తారు. క‌నీసం మ‌నం ఎలాంటి ప‌రిస్థితుల్లో వున్నాం అని కూడా అనుకోరు. నేను ఓ సారి జీవీకేలో టాయిలెట్ కి వెళుతుంటే సార్ ఓ సెల్ఫీ అన్నాడు. ఇక్క‌డ బాగోదు.. బ‌య‌ట తీసుకుందాం అన్నా.. ప‌ర్లేదు సార్ అన్నాడు. మ‌రొక‌ర‌యితే ఓ చావు ద‌గ్గ‌ర‌కు వెళితే... సార్ ఓ సెల్ఫీ దిగుతా అంటూ.. నేనీమి మాట్లాడ‌కుండానే ఓ సెల్ఫీ తీసుకుని వెళ్లి పోయాడు. ఇలా సెల్ఫీ అనేది ఇప్పుడు ఓ క్రేజీగా మారిపోయింది. అలా సెల్ఫీ తీసుకోవ‌డం వ‌ల్ల ఓ యువ‌కుడు త‌న ప్రాణాల మీద‌కు తెచ్చుకుని.. వారి నుంచి త‌ప్పించుకోవ‌డానికి ర‌క‌ర‌కాల వేషాలు వేస్తూ.. ఎలా త‌ప్పించుకుని తిర‌గాడ‌నేది చూపించాం అన్నాడు.

నా వ‌ర‌కు అయితే సెల్ఫీ అంటే నాకు ఇష్టం వుండ‌దు. సెల్ఫీ యాంగిల్ నాకు అస‌లు న‌చ్చ‌దు. సెల్ఫీ తీసుకునే వాడి ముఖం చాలా లావుగానూ... అందులో వున్న‌వారంతా స‌న్న‌గా క‌నిపిస్తారు. అందుకేనాకిష్టం వుండ‌దు. అలానే నాకు స్ఫూఫ్ లు చేయ‌డం ఇష్టం వుండ‌దు. డైరెక్ట‌ర్లు ఏదో బ‌ల‌వంతం చేస్తేనే చేస్తా. మొద‌ట్లో చేశా గానీ.. ఆ త‌రువాత త‌గ్గించా. కానీ ఇప్పుడొస్తున్న కొన్ని సినిమాల్లో స్ఫూఫ్ లు వుండ‌టం వ‌ల్ల వాటి ప్ర‌భావం నా మీద ప‌డింది. ఈ సినిమాలో కూడా రెండు మూడు స్ఫూఫ్ లున్నాయి. కానీ అవి క‌థ‌లో బాగ‌మే. ప్రేక్ష‌కుల‌ను బాగా ఎంట‌ర్టైన్ చేస్తాయి అన్నాడు

ఇంకా మాట్లాడుతూ... నాకు వ‌రుస‌గా ఏడు సినిమాలు ఫ్లాపులొచ్చాయి. అందువల్ల‌నే స్పీడ్ త‌గ్గించా. కంటెంట్ వున్న సినిమాలు చేయ‌డం ముఖ్య‌మ‌ని భావించే.. నిదానంగా సినిమాలు చేస్తూ వెళ‌దాం అనుకుంటున్నా. ప్ర‌స్తుతం ఇంట్లో దెయ్యం.. నాకేం భ‌య్యం, మేడ‌మీద అబ్బాయి చేస్తున్నా. వాటితో పాటు స‌ముద్ర‌ఖ‌ని డైరెక్ష‌న్లో త‌మిళ సినిమా చేయ‌బోతున్నా. త‌మిళంలో రిజ‌ల్ట్ ను బ‌ట్టి.. దాన్ని తెలుగులో విడుద‌ల చేయాలా లేదా అనేది డిసైడ్ అవుతుంది. సొంత బ్యాన‌ర్లో వ‌చ్చే వేస‌వి నుంచి సిసిమా వుంటుంది. ప్ర‌తి స‌మ్మ‌ర్ లోనూ ఓ సినిమా చేద్దామ‌నే ప్లాన్ వుంది. అన్న‌య్య ఆర్య‌న్ రాజేష్ మొద‌ట ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కున్న త‌రువాత‌.. ఇద్ద‌రం క‌లిసి న‌టిద్దాం అనుకుంటున్నాం. నాన్న డైరక్ష‌న్ చేసి ఆ ఒక్క‌టే అడక్కు సినిమాకు సీక్వెల్ గా ఆ ఒక్క‌టే అడుగుతా అనే సినిమాను మా బ్యాన‌ర్లో చేద్దాం అనుకున్నాం. రంభ.. రాజేంద్ర‌ప్ర‌సాద్ అత్త‌మామ‌లుగా నేను అందులో అల్లుడిగా చేద్దాం అనుకున్నా.. కానీ ఆ ప్రాజెక్టును ఎవ‌రిచేతిలో పెట్టాల‌నే సందిగ్ధంతోనే అది ఇంకా కార్య‌రూపం దాల్చ‌డం లేదు. ఇండ‌స్ట్రీకి యంగ్ టాలెంటెడ్ రైట‌ర్లు రావాలి. అప్పుడే మంచి సినిమాలొస్తాయి అంటూ ముగించాడు.
Tags:    

Similar News