మోహన్ బాబు.. ఈ పేరెత్తగానే ఇండస్ట్రీలో చాలామంది భయపడతారు. ఆయన కోపం గురించి చాలామందికి తెలుసు. ఆయనతో కలిసి సినిమా చేయడంలో ఇబ్బందుల గురించి కూడా మాట్లాడుకుంటుంటారు. ఉదయం 7 గంటలకే షూటింగ్ మొదలుపెట్టాలని.. చెప్పిన టైంకి చెప్పినట్లు అన్నీ జరిగిపోవాలని.. ఏమాత్రం తేడా వచ్చినా కోపంతో ఊగిపోతారని.. క్రమశిక్షణ విషయంలో అస్సలు రాజీపడరని.. ఇలా రకరకాలుగా చెప్పుకుంటారు. తాను కూడా ఈ మాటలన్నీ విన్నానని.. కానీ మోహన్ బాబుకు అస్సలు భయపడలేదని.. మిమ్మల్ని చూసి భయపడనంటూ ఆయనతోనే నేరుగా చెప్పేశానని అంటున్నాడు అల్లరి నరేష్.
‘మామ మంచు అల్లుడు కంచు’ సినిమాలో మోహన్ బాబుతో కలిసి పని చేయడం గురించి అల్లరి నరేష్ చెబుతూ.. ‘‘అలాంటి లెజెండ్ తో నటించడం గొప్ప అనుభూతి. ఈ సినిమాకు పనిచేయడం ద్వారా డైలాగ్ డెలివరీలో ఆయన్నుంచి చాలా నేర్చుకున్నా. మోహన్ బాబు చాలా స్ట్రిక్ట్ అని.. కొడతారని కొందరన్నారు. నేనైతే ఆయనతో వెంటనే కలిసిపోయా. మొదటిరోజే ‘అంకుల్.. మీకు గౌరవమిస్తాను కానీ భయపడను. ఎందుకంటే భయపడితే నేను ఫ్రీగా నటించగలను’ అని చెప్పేశాను. ఆయన నవ్వేశారు. నిజానికి ఆయన ఎంత సరదాగా ఉంటారన్నది ఆ తర్వాతే తెలిసింది’’ అని చెప్పాడు నరేష్. వాస్తవానికి తన 50వ సినిమాను సోలో హీరోగానే చేద్దామని ప్లాన్ చేశానని.. కానీ మోహన్ బాబు, విష్ణు పట్టుబట్టి ‘మామ మంచు అల్లుడు కంచు’నే చేయించారని నరేష్ చెప్పాడు.