`మహర్షి`లో ఫ్రెండ్ రోల్ అల్లరి నరేష్ కు ఓ కొత్త గుర్తింపు తెచ్చింది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న నరేష్ కి మహర్షి సక్సెస్ ఊపిరి పోసింది. కామెడీ మాత్రమే కాదు.. తనలో ఎమోషనల్ పెర్ఫామర్ ఉన్నాడని ప్రూవైంది మరోసారి. మహర్షి తర్వాత సెలక్టివ్ గానే ముందుకు వెళ్తున్నాడు. రొటీన్ కంటెంట్ కు దూరంగా డిఫరెంట్ జానర్లను ఎంపిక చేసుకుంటున్నాడని తాజా అప్ డేట్ ని బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం అల్లరి నరేష్ ఓ కొరియన్ మూవీ రీమేక్ లో నటించనున్నాడని తెలుస్తోంది.
సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు రీమేక్ లతో హిట్లు కొడుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ `ఓ బేబి` ఓ రీమేక్. తాజాగా కొరియన్ మూవీ `డాన్సింగ్ క్వీన్` రీమేక్ రైట్స్ దక్కించుకుని స్క్రిప్టును రెడీ చేస్తున్నారు. ఇందులో నరేష్ హీరోగా నటిస్తాడని తెలుస్తోంది. హీరోయిన్ గా చందమామ కాజల్ అగర్వాల్ ని తీసుకోవాలని సురేష్ బాబు ప్లాన్ చేస్తున్నారుట. నరేష్ సరసన ఆ పాత్ర కి చందమామ అయితే పర్ పెక్ట్ గా యాప్ట్ అవుతుందని తనతో సంప్రదింపులు జరుపుతున్నారుట. ప్రస్తుతం కాజల్ కి తెలుగులో అవకాశాలు కూడా లేవు. కోలీవుడ్ ఇండియన్-2 సినిమా మినహా మరో కమిట్ మెంట్ లేదు. ఈ నేపథ్యంలో నరేష్ సరసన గ్రీన్ సిగ్నెల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే యంగ్ హీరోల సరసన నటించేందుకు కాజల్ ప్రిపేర్డ్ గా ఉంది. కాబట్టి నరేష్ కి నో చెప్పే ఛాన్స్ లేదు. తన పాత్ర కంటెంట్ నచ్చితే హీరో ఎవరు? అన్నది చూడడం లేదు ఈ భామ. అయితే పారితోషికం మాత్రం భారీగా డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఇటీవలే బాలయ్య 106వ సినిమా కోసం బోయపాటి.. కాజల్ ని సంప్రదిస్తే అనాసక్తి చూపించింది. పారితోషికం కొటిన్నర పైగానే డిమాండ్ చేసిందని...ఆ లెక్క కుదరకే స్కిప్ కొట్టారని ప్రచారమైంది. మరి సురేష్ బాబు కాజల్ కి అంత చెల్లించుకుంటారా? అన్నది చూడాలి.