తేజు కండలు - అరవింద్ మాటలు

Update: 2018-07-04 10:16 GMT
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తన కొత్త సినిమా తేజ్ ఐ లవ్ యు కోసం టెన్షన్ గానే ఎదురు చూస్తున్నాడు. దానికి కారణం లేకపోలేదు. గత ఐదు సినిమాలుగా తనతో దోబూచులాడుతున్న సక్సెస్ ని ఎలాగైనా దీంతో అందుకోవాలని కసి మీదున్నాడు. ట్రైలర్ తో పాటు ఆడియో మరీ భారీ రెస్పాన్స్ తెచ్చుకోకపోయినా సినిమాలో విషయం ఉందని నమ్ముతున్నాడు కాబట్టి అది ఎంత వరకు నిలుస్తుందో శుక్రవారం తేలిపోతుంది. ఇక ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో తేజు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన అల్లు అరవింద్ అతని కండల గురించి మాట్లాడ్డం విశేషం. తేజు మొదట్లో చాలా సన్నగా ఉండేవాడని ఇప్పుడు ఇలా ఒళ్ళు పెంచి కండలు మలచిన తీరు చూసి తను ఏం తింటున్నాడో ఏం చేస్తున్నాడో అడిగానని చెప్పుకొచ్చారు. దీని తేజు కూడా బదులిస్తూ ఈ మధ్య కొంచెం లావవ్వాల్సి వచ్చిందని చెప్పాడట. మొదటి సినిమా రేయ్ అయినప్పటికీ తాను నిర్మించిన పిల్లా నువ్వు లేని జీవితం విడుదల కావడం గుర్తు చేసుకున్న అల్లు అరవింద్ అప్పటి నుంచే తేజు పడుతున్న కష్టాన్ని దగ్గర నుంచి గమనించారట.

ఇవన్నీ తేజూకు బాగా బూస్ట్ ఇచ్చే మాటలే. గోపీచంద్ పంతం తప్ప పెద్దగా పోటీ లేకుండా బరిలో దిగుతున్న తేజ్ ఐ లవ్ యుకి పాజిటివ్ టాక్ వస్తే చాలు బాక్స్ ఆఫీస్ దగ్గర నిలదొక్కుకోవచ్చు. పైగా చెప్పుకోదగ్గ సినిమాలు కూడా ఏవి లేవు. సమ్మోహనం బాగా స్లో అయిపోగా అది మినహా ఇంకే సినిమా లేదు. సంజు బ్లాక్ బస్టర్ అయినప్పటికీ దాని రీచ్ అందరికి కాదు కనక హిందీ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులు మాత్రమే దాని వైపు మళ్లుతున్నారు. సో సాయి ధరమ్ తేజ్ కి ఇది మంచి ఛాన్స్. టాక్ కనక బాగా వస్తే ఆ పైవారం వచ్చే చినబాబు-విజేత నుంచి పెద్ద ఇబ్బంది ఎదురు కాకపోవచ్చు. కానీ తేజ్ ఐ లవ్ చాలా బాగుంది అనే టాక్ వస్తేనే ఇది సాధ్యమవుతుంది. కండల గురించి అల్లు అరవింద్ చెప్పడం బాగానే ఉంది కానీ ఈ సినిమాలో వాటిని చూపించే అవసరం అంతగా వచ్చినట్టు లేదు .
Tags:    

Similar News