మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆయన కుటుంబం నుంచి పవన్ కళ్యాణ్ హీరోగా పరిచయమయ్యాడు. అన్నయ్యకు దీటుగా ఎదిగాడు. ఓ దశలో అన్నయ్యనూ దాటేశాడు. నాగబాబు హీరోగా పెద్దగా ప్రయత్నాలు చేసింది లేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ హీరో అయ్యాడు అతనూ మంచి స్థాయికి వెళ్లాడు. రామ్ చరణ్ వచ్చాడు.. స్టార్ ఇమేజ్ సంపాదించాడు.
సాయిధరమ్ తేజ్ అరంగేట్ర సినిమాలో ఇబ్బంది పడ్డా సరే.. తర్వాత నిలదొక్కుకున్నాడు. వడివడిగా పైకెదుగుతున్నాడు. వరుణ్ తేజ్ కూడా మంచి పేరే సంపాదించాడు. ఇలా మెగా ఫ్యామిలీలో దాదాపుగా హీరోలందరూ నిలదొక్కుకున్నారు. ఒక్క అల్లు శిరీష్ మాత్రమే హీరోగా వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. సక్సెస్ రుచీ చూడలేదు. ఐతే ఎట్టకేలకు ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమా అతడికి మంచి ఫీడ్ బ్యాక్ తో పాటు.. మంచి విజయాన్నీ అందించేలా ఉంది.
గత రెండు సినిమాలతో పోలిస్తే శిరీస్ ‘శ్రీరస్తు శుభమస్తు’లో అతడి పెర్ఫామెన్స్ చాలా మెరుగైంది. బాడీ లాంగ్వేజ్ మార్చాడు. ఆత్మవిశ్వాసంతో నటించాడు. ప్రకాష్ రాజ్.. రావు రమేష్ లాంటి గొప్ప నటుల్ని ముందు పెట్టుకుని ఎమోషనల్ సీన్స్ లో నటించడం అంటే చిన్న విషయం ఏమీ కాదు. ఐతే శిరీస్ ఆ సన్నివేశాల్లో కాన్ఫిడెంట్ గానే నటించాడు.
నటుడిగా అన్ని లోపాలూ కవర్ చేసేశాడని కాదు కానీ.. గత సినిమాల కంటే బెటర్ అని మాత్రం అనిపించాడు శిరీష్. ఫీడ్ బ్యాక్ బాగానే ఉంది. ఇక సినిమాకూ మంచి స్పందన వస్తోంది. మంచి ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న టాక్ వచ్చింది. దీంతో శిరీష్ తొలి హిట్ కొట్టేసినట్లే. మొత్తానికి మెగా హీరోల్లో అందరూ సక్సెస్ ఫుల్ హీరోలు అయిపోయారు. అలాగే తన చిన్న కొడుకు హీరోగా నిలదొక్కుకుంటే చూడాలన్న అల్లు అరవింద్ కల ఇన్నాళ్లకు నెరవేరిందన్నమాట.