అల్లు అరవింద్ చెవిలో క్యాలీఫ్లవర్ పెట్టడానికి ట్రై చేసిన 'జాతిరత్నాలు' అనుదీప్..!
'జాతిరత్నాలు' సినిమాతో డైరెక్టర్ అనుదీప్ కేవీ ఎలాంటి విజయాన్ని అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న సినిమాగా బాక్సాఫీస్ వద్దకు వచ్చి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందీ చిత్రం. అయితే ఈ సినిమా విడుదలకు ముందే అందరి దృష్టిని ఆకర్షించడానికి కారణం చిత్ర బృందం ప్లాన్ చేసిన ప్రమోషన్స్ అని చెప్పాలి.
'జాతిరత్నాలు' సినిమా టైమ్ లో డైరెక్టర్ అనుదీప్ ఇంటర్వ్యూలు స్పీచ్ లు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. ప్రతీ దానికి వెరైటీగా కాస్త తిక్క తిక్కగా సమాధానం చెబుతూ హిలేరియస్ గా నవ్వించారు. అయితే ఇప్పుడు అనుదీప్ తన శిష్యుడి సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడానికి అలాంటి ప్రమోషన్లనే ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్తున్నాడు.
అనుదీప్ కేవీ దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసిన వంశీధర్ గౌడ్ మరియు లక్ష్మీ నారాయణ.. ఇప్పుడు ''ఫస్ట్ డే ఫస్ట్ షో'' అనే చిత్రంతో డైరెక్టర్లుగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. దీనికి అనుదీప్ కథ అందించాడు. పూర్ణోదయ ఏడిద నాగేశ్వరరావు మనవరాలు, ఏడిద శ్రీరామ్ కుమార్తె శ్రీజ ఈ సినిమాని నిర్మిస్తోంది.
మొదటి నుంచే ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సినిమాకు వెరైటీ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఫస్ట్ లుక్ లాంచ్ కు సంబంధించిన వీడియోతో జనాల దృష్టిలో పడేలా చేశారు. ఈ క్రమంలో ఇంకా చిత్రీకరించిన ఓ పాటను టాలీవుడ్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తో లాంచ్ చేయించారు. ఈ హిలేరియస్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
అనుదీప్ తో సహా 'ఫస్ట్ డే ఫస్ట్ షో' టీమ్ కలిసి గీతా ఆర్ట్స్ ఆఫీసుకు వెళ్లి అల్లు అరవింద్ తో సమావేశం అవుతారు. మూవీ మేకింగ్ కు సంబంధించిన విశేషాలు - బడ్జెట్ వివరాలు అగ్ర నిర్మాతకు చెప్పి.. ఆయన కంపెనీతో టై అప్ అవుతామని ఆఫర్ ఇచ్చి తమాషాగా ఒక ఆట ఆడుకున్నారు.
సినిమా కోసం 200 ఎకరాల్లో భారీ సెట్ తో నారాయణఖేడ్ ను రీ క్రియేట్ చేయాలని ప్లాన్ చేశామని.. కుదరకపోవడంతో చివరకు నారాయణ్ ఖేడ్ రియల్ లొకేషన్స్ లో షూట్ చేశామని అనుదీప్ మరియు డైరెక్టర్ వివరించారు. అంతా కలుపుకొని దాదాపు 370 కోట్ల వరకూ ఖర్చు అయిందని.. దాని కంటే ఎక్కువ ఆఫర్ చేస్తే 'ఫస్ట్ డే ఫస్ట్ షో' సినిమాని గీతా ఆర్ట్స్ కి ఇస్తామని డీల్ మాట్లాడతారు.
దీనికి నా చెవిలో ఏమైనా క్యాలీఫ్లవర్ కనిపిస్తుందా అని అల్లు అరవింద్ అనడం నవ్వు తెప్పిస్తుంది. అలానే అల్లు అర్జున్ కు పది నిమిషాల్లో ఒక పాన్ ఇండియా కథ చెప్తామని డైరెక్టర్ అంటే.. బన్నీకి నీ ఫోటో పంపించి గేటు దగ్గరకు కూడా రానివద్దని చెబుతానంటూ అల్లు అరవింద్ కూడా వారితో పోటీగా నవ్వించారు.
చివరకి అసలు పాట లేకుండానే ల్యాప్ టాప్ లో సాంగ్ లాంచ్ చేయించి.. అల్లు అరవింద్ తో అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇప్పించడం హైలైట్ గా నిలిచింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ముఖ చిత్రాన్ని ప్రచురించిన ఇండియా టుడే మ్యాగజైన్ ని చూపిస్తూ అల్లు అరవింద్ సంతోషం వ్యక్తం చేయడాన్ని గమనించవచ్చు.
ఈ మొత్తం ఎపిసోడ్ ను కామెడీగా చిత్రీకరించి మూవీ ప్రమోషన్స్ కోసం ఉపయోగిస్తున్నారు. ఈ వీడియో ఆద్యంతం అనుదీప్ మార్కుతో అలరిస్తోంది. అల్లు అరవింద్ లాంటి పెద్ద నిర్మాత చాలా స్పోర్టివ్ గా ఇలాంటి ఫన్నీ ఇంటర్వ్యూలో పాల్గొనడం గొప్ప విషయం. ఈ విధంగా చిన్న సినిమాకు తమవంతు సపోర్ట్ ఇచ్చారని చెప్పాలి.
Full View

ఇటీవల కాలంలో థియేటర్లకు రప్పించడం అనేది చిన్న సినిమాలకు సవాలుగా మారింది. ఏదైనా వెరైటీగా ప్లాన్ చేసి వారి దృష్టిని ఆకర్షిస్తేనే అంతో ఇంతో ఆదరణ దక్కుతోంది. అల్లు అరవింద్ లాంటి స్టార్ ప్రొడ్యూసర్స్ ముందుకొచ్చి ఇలా ప్రమోట్ చేస్తే.. సినిమా విజయానికి తమవంతు మద్దతు ఇచినట్లే. మరి 'ఫస్ట్ డే ఫస్ట్ షో' సినిమాకు ఈ ప్రమోషనల్ వీడియో ఎంత మేర ఉపయోగపడుతుందో చూడాలి.