ధృవ ఈవెంట్: ఈయన లెక్కల మాష్టారు

Update: 2016-12-05 03:40 GMT
'మగధీర' సినిమా తరువాత రెండోసారి రామ్‌ చరణ్‌ తో సినిమా తీస్తున్నాడు అల్లు అరవింద్. అయితే ఈ మామ ఇప్పుడు తను తీస్తున్న సినిమా గురించి చాలా విషయాలే చెప్పాడు. ముఖ్యంగా సినిమా రిలీజ్ డేట్ గురించి చాలా వర్కవుట్  చేశాడట. పదండి ఆ మాటలేంటో విందాం.

''సినిమాను త్వరగా రిలీజ్ చేద్దామంటే డిమానిటైజేషన్ అడ్డు పడింది. అసలు 9న రిలీజ్ చేద్దామనుకునే ముందే డిసెంబర్ 2 అనే డేట్ ను ఫిక్సు చేశాం. కాని జనాల దగ్గర డబ్బులున్నాయో లేదో అని భయపడి ఆపేశాం. ఇక 9న చేసేద్దాం అని చరణ్‌ చెప్పాడు. కాని నాకు భయంగానే ఉంది. అయితే అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయ్యాక.. జనాలు సినిమా కోసం ఎంత ఆత్రంగా ఎదురు చూస్తున్నారో అర్ధమైంది. మేం సరైన నిర్ణయమే ఎంచుకున్నాం'' అంటూ సెలవిచ్చారు అరవింద్ వారు. మొత్తానికి ఈయన పెద్ద లెక్కల మాష్టార్ అని ప్రూవ్ అవ్వలేదా? అయ్యిందిగా!!

''20 సంవత్సరాల క్రితం వచ్చిన రోజా సినిమాను చూసి అరవింద్ స్వామిని ఇప్పటివరకు అలాగే గుర్తుపెట్టుకున్నారు. ఇప్పుడు ధృవ సినిమాతో మనోడిని మరో 20 సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటారని చెప్పగలను'' అంటూ అరవింద్ స్వామి గురించి చెప్పాడు గీతా ఆర్ట్స్ అధినేత.

''ఈ సినిమాకు సంగీతం అందించిన హిప్ హాప్ తమిళ చాలా కష్టపడ్డాడు. మంచి ఔట్పుట్ ఇచ్చాడు. ఇప్పుడు బ్యాగ్రౌండ్ స్కోర్ చేస్తూ.. మనోడు చదువుకుంటున్నాడు తెలుసా? అతను ఫైనలియర్ పరీక్షలు రాస్తున్నాడు. తెలుగు కూడా నేర్చుకుంటున్నాడు. బహుశా తెలుగింటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడేమో.. ముద్దుగా ముద్దుగా తెలుగు కూడా మాట్లేడేస్తున్నాడు'' అంటూ హిప్ హాప్ తమిళను ఆటపట్టించాడు కూడా.


ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ పేల్చిన కొన్ని వన్ లైనర్లను ఓ మారు ఇనుకోండి మరి..

--బన్నీ ఉళ్ళో లేడమ్మా.. ఉంటే ఎందుకు రాడు..

--పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ వచ్చే ఆకేషన్లు త్వరలో ఉన్నాయ్.. మీరు ఓపికపడితే అవి నేను చెబుతాను..

--మీరు సాధారణంగా ఆదివారం ఫ్యామిలీతోనే ఉంటారు. అటువంటిది మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇక్కడి పిలిచినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. (కె టి ఆర్ ను ఉద్దేశించి)

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News