ఆదివారం సాయంత్రం జరిగిన సైరా ఈవెంట్ మెగా- అల్లు ఫ్యాన్స్ మధ్య ఊహించని చిచ్చు పెట్టిందా? అంటే.. అవుననే ముచ్చట సాగుతోంది. అసలే ఈ వేదికపై మెగా హీరోలంతా కనిపిస్తే బన్ని ఒక్కడే స్కిప్ కొట్టడం మెగా ఫ్యాన్స్ లో కోపతాపాలకు కారణమైంది. చిరంజీవికి పెద్ద ఫ్యాన్ అయిన బన్ని కనిపించకపోవడం చిరు-చరణ్ అభిమానుల్ని నిరాశపరిచింది.
దీనికి తోడు వేదికపైకి వచ్చిన అల్లు అరవింద్ ని చూసి మెగాస్టార్ - మెగా పవర్ స్టార్ అభిమానులు మరింత సీరియస్ అయ్యారు. అరవింద్ తనకు తానుగానే చిరు గురించి సైరా గురించి మాట్లాడేందుకు రెడీ అవుతుంటే మెగా ఫ్యాన్స్ కొందరు అవసరం లేదు అన్నట్టే చేతులు ఊపుతూ ఎక్స్ ప్రెషన్ ఇవ్వడం కనిపించింది. అయితే మెగా ఫ్యాన్స్ ఇలా చేయడం బన్ని అభిమానుల్ని తీవ్రంగా హర్ట్ చేసిందని తెలుస్తోంది. ఆ మేరకు బన్ని ఫ్యాన్ గ్రూప్స్ డిస్కషన్ వేడెక్కిస్తున్నాయ్.
అయితే ఇక్కడ ఫ్యాన్స్ ఓ విషయాన్ని గుర్తెరగాలి. మెగాస్టార్ చిరంజీవి అగ్ర కథానాయకుడిగా ఎదిగే క్రమంలో వెన్నంటి నిలిచి బాస్ లా పని చేశారు అరవింద్. మెగాస్టార్ తో పాటుగానే మెగా నిర్మాతగా ఎదిగారు గీతాధినేత. అందువల్ల ఆ ఇద్దరి అనుబంధం విడదీయలేనిది. అలాగే మావయ్య అంటే బన్నికి చచ్చేంత వీరాభిమానం. మెగాస్టార్ లేకపోతే మేం లేనేలేమని బన్ని బహిరంగ వేదికలపైనే చెబుతుంటారు. అయితే ఫ్యాన్స్ మధ్య ఈ తుఫాన్ ఎందుకు? అన్నది ఆశ్చర్యం కలిగిస్తోంది. కొంచెం ప్రవర్తన సరిగా ఉండాలి కదా! అంటూ అల్లు ఫ్యాన్స్.. మెగా ఫ్యాన్స్ ని అనడంతో ఇరు వర్గాల వైరుధ్యం బహిర్గతమైంది. అయితే ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడడం అవసరం.